• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉరేసుకోమంటారా.. వ్యాక్సిన్ల కొరతపై కేంద్రమంత్రి షాకింగ్ రిప్లై... కోవాగ్జిన్ పేటెంట్ రద్దు చేసే యోచన...

|

ఓవైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే... మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం వల్లకాడులా మారుతుంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచకుండా కేంద్రం ఏం చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకనైనా మేల్కొని వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని బుధవారమే(మే 12) కేంద్రానికి లేఖ కూడా రాశాయి.అటు కోర్టులు,ఇటు ప్రతిపక్షాలు,మేదావులు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు కేంద్రమంత్రి సదానంద గౌడను ప్రశ్నించగా... ఆయన నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది.

మమ్మల్ని ఉరేసుకోమంటారా : సదానంద గౌడ

మమ్మల్ని ఉరేసుకోమంటారా : సదానంద గౌడ

దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతపై మీడియా సదానంద గౌడను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ..'దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోర్టులు చాలా మంచి ఉద్దేశంతో చెబుతున్నాయి. అయితే నేనొకటి అడగదలుచుకున్నా... ఒకవేళ కోర్టులు రేపటికల్లా ఇంత వ్యాక్సినేషన్ జరగాలని ఆదేశించాయనుకోండి... ఒకవేళ అది మేం చేయలేకపోతే మమ్మల్ని ఉరేసుకుని చావమంటారా..?' అంటూ తీవ్ర అసహనంతో స్పందించారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నీతిగా,నిబద్దతగా తన బాధ్యతను నెరవేరుస్తోందని సదానంద గౌడ పేర్కొన్నారు. ప్రాక్టికల్‌గా చూస్తే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని... అలాంటి వాటిని మనం మేనేజ్ చేయగలమా...? అని మీడియానే ఎదురు ప్రశ్నించారు.

కోవాగ్జిన్ పేటెంట్ రద్దు చేసే యోచనలో...

కోవాగ్జిన్ పేటెంట్ రద్దు చేసే యోచనలో...

స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్‌కు కోవాగ్జిన్ పేటెంట్‌ను రద్దు చేసే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని సదానంద గౌడ వెల్లడించారు. పేటెంట్స్ చట్టం కింద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ(ఐపీ) ప్రొటెక్షన్‌ను రద్దు చేసే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. కోవాగ్జిన్ పేటెంట్ హక్కులను తొలగించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో... దేశానికి సరిపడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు పేటెంట్ హక్కులను రద్దు చేసే విషయమై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందన్నారు.

రాత్రికి రాత్రే అసాధ్యమన్న కేంద్రమంత్రి...

రాత్రికి రాత్రే అసాధ్యమన్న కేంద్రమంత్రి...

పేటెంట్ హక్కులను రద్దు చేసి ఇతర వ్యాక్సిన్ మ్యానుఫాక్చరర్స్‌కు అనుమతినిచ్చినా... ఉత్పత్తి ప్రక్రియ రాత్రికి రాత్రే పుంజుకోదని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే టెక్నాలజీకి తోడు ముడిసరుకు సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్ల విషయంలో తమిళనాడు,మహారాష్ట్ర ఒక అడుగు ముందు ఉన్నాయని చెప్పారు. గ్లోబల్ టెండర్ల అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని... చట్టబద్దంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  Covishield Vaccine డోసుల మధ్య గ్యాప్ 12- 16 వారాలకు పెంచచ్చు!!
  పేటెంట్ రద్దు చేయాలన్న డిమాండ్...

  పేటెంట్ రద్దు చేయాలన్న డిమాండ్...


  ప్రస్తుతం దేశంలో భారత్ బయోటెక్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మాత్రమే కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పేటెంట్ హక్కులు ఈ రెండు సంస్థలు తమ వద్దే పెట్టుకోవడంతో ఇతర మాన్యుఫాక్చర్స్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో పేటెంట్ హక్కులను రద్దు చేసి ఇతర మాన్యుఫాక్చరర్స్‌కి కూడా అనుమతినివ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కేవలం ఈ రెండు సంస్థల పైనే ఆధారపడితే 135 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు,మూడేళ్లు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పేటెంట్ రద్దుపై ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది.

  English summary
  Union Minister for Chemicals and Fertilisers D V Sadananda Gowda on Thursday sought to know whether people in the government should hang themselves for their failure to produce vaccines as was directed by the government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X