వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఎంకే, స్టాలిన్ చాలెంజ్, సత్తా చాటుకున్న అళగిరి, భారీ ర్యాలీ సక్సస్: కరుణానిధి !

|
Google Oneindia TeluguNews

Recommended Video

భారీ ర్యాలీ నిర్వహించిన అళగిరి...!

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇంత కాలం సోదరుడు ఎంకే. స్టాలిన్ విషయంలో చూసిచూడనట్లు వెలుతున్న కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంకే. అళగరి కరుణానిధి మరణం తరువాత ఆ పార్టీ మీద తిరుగుబాటుకు సిద్దం అయ్యారు. డీఎంకే పార్టీ, స్టాలిన్ కు చాలెంజ్ చూస్తూ బుధవారం చెన్నైలో నిర్వహించిన శాంతి ర్యాలి సక్సస్ కావడంతో అళగిరి ఇకముందు ఏం చేస్తారో అంటూ డీఎంకే నాయకులు ఆందోళన చెందుతున్నారు.

అన్నాదురై విగ్రహం

అన్నాదురై విగ్రహం

బుధవారం అళగిరి ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నాసాలైలోని అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంకే. అళగిరి శాంతి ర్యాలీని ప్రారంభించారు. నల్ల రంగు షర్టు వేసుకుని తన తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మృతికి సంతాపం తెలుపుతూ అళగిరి ర్యాలీలో పాల్గొన్నారు.

అళగిరి పక్కా ప్లాన్

అళగిరి పక్కా ప్లాన్

ఎంకే. అళగిరి తన ర్యాలీ సక్సస్ కావడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దక్షిణ తమిళనాడుతో పాటు అనేక జిల్లాల నుంచి తన మద్దతుదారులు చెన్నైకి చేరుకునే విదంగా పక్కా ప్లాన్ వేశారు. జనసమీకరణ విషయంలో ఎంకే. అళగిరికి ఆయన మద్దతుదారులు సహకరించడంతో వేలాధి మంది ర్యాలీలో పాల్గొన్నారు.

భారీ ర్యాలీకి బందోబస్తు

భారీ ర్యాలీకి బందోబస్తు

శాంతి ర్యాలీ సందర్బంగా అళగిరి ఓపెన్ టాప్ వాహనంలో మెరీనా బీచ్ కు బయలుదేరారు. ఆయన మద్దతుదారులు అందరూ నల్ల షర్టులు వేసుకుని కరుణానిధి మృతికి సంతాపం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్బంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు.

రాజకీయాలకు చెక్

రాజకీయాలకు చెక్

మెరీనా బీచ్ లోని కరునానిధి సమాధి వరకు శాంతి ర్యాలి నిర్వహించిన అళగిరి అనంతరం తండ్రికి నివాళులు అర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేస్తారని అందరూ భావించారు. అయితే ఇది శాంతి ర్యాలీ అంటూ అళగిరి మీడియాతో అన్నారు. డీఎంకే పార్టీ, తమ్ముడు ఎంకే. స్టాలిన్ మీద పెద్దగా విమర్శలు చెయ్యని అళగిరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అళగిరి ప్రయత్నాలు

అళగిరి ప్రయత్నాలు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని 2001లో కరుణానిధి తన కుమారుడు అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించారు. 2003 మళ్లీ పార్టీలోకి అళగిరి వెళ్లారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని 2014లో మళ్లీ రెండోసారి అళగిరిని బహిష్కరించారు. అప్పటి నుంచి మళ్లీ పార్టీలోకి రావాలని అళగిరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరుణానిధి మరణించే వరకు అళగిరి చేసిన ప్రయత్నాలు అన్నీ వృదా అయ్యాయి.

డీఎంకే డేగ కన్ను

డీఎంకే డేగ కన్ను

తమ్ముడు స్టాలిన్ మీద తిరుగుబాటు చేసి చెన్నైలో ర్యాలీ సక్సస్ చేసిన అళగిరి తరువాత ఏం చేస్తారు అంటూ డీఎంకే పార్టీ నాయకులు డేగకన్ను వేశారు. ఎంకే. అళగిరి ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే పార్టీ సీనియర్ నేత పీఎం. మన్నన్ సైతం పాల్గొని మద్దతు తెలపడంతో డీఎంకే రెండుగా చీలిపోయే అవకాశం ఉందని కార్యకర్తలు అంటున్నారు. శాంతి ర్యాలీ సందర్బంగా అళగిరి మద్దతుదారులు చెన్నైలో భారీ ఎత్తున ‘నాతో చేతులు కలపండి, పార్టీని బలోపేతం చెయ్యండి' అనే నినాదాలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

English summary
Expelled DMK leader MK Alagiri on Wednesday held a show of strength at late father at party patriarch M Karunanidhi's memorial at the Marina beach in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X