వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా v/s పాకిస్థాన్ ట్వీట్‌పై ఈసీ సీరియస్, బీజేపీ నేత కపిల్ మిశ్రాకు నోటీసులు, 24 గంటల్లో..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా v/s పాకిస్థాన్‌గా పోలుస్తూ బీజేపీ నేత కమిల్ మిశ్రా చేసిన ట్వీట్‌ను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ట్వీట్‌పై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుక షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు ఈసీ తెలిపింది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్

ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు ఉంటుందని కపిల్ మిశ్రా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆప్‌ను పాకిస్థాన్‌గా పోల్చడంతో వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఎన్నికల సంఘం స్పందించి.. షోకాజ్ నోటీసు జారీచేసింది.

Recommended Video

India vs Pak Polls On February 8 || Oneindia Telugu
మినీ పాకిస్తాన్

మినీ పాకిస్తాన్

షాహిన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేస్తుందని కూడా కపిల్ మిశ్రా విమర్శించారు. ఆ ప్రాంతంలోకి పాకిస్తాన్ ప్రవేశించి మినీ పాకిస్తాన్‌గా మారుస్తోందని మండిపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్, ఆప్ వారే పాకిస్తాన్ అని ఆరోపించారు. వారికి ఎన్నికల్లో ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. చంద్‌బాగ్, ఇందర్‌లోక్‌లో చట్టాలు అమలుకావడం లేదని కపిల్ మిశ్రా మండిపడ్డారు.

తప్పుగా నామపత్రం..

తప్పుగా నామపత్రం..

మోడల్ టౌన్ అసెంబ్లీ నుంచి కపిల్ మిశ్రా బరిలోకి దిగారు. ఆయన నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరిచారని ఆప్ ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. అతని అభ్యర్థత్వాన్ని రద్దుచేయాలని విన్నవించింది.

 ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

జెస్సికా లాల్ హత్యపై యూత్ ఫర్ జస్టిస్ పేరుతో జరిగిన ఆందోళనలకు కపిల్ మిశ్రా నాయకత్వం వహించారు. అలా వెలుగులోకి వచ్చిన ఆయన తర్వాత ఆప్‌ పార్టీ ఏర్పాటులో కీ రోల్ పోషించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2017లో సత్యేంద్ర జైన్, కపిల్ మిశ్రాపై అవినీతి ఆరోపణలు రావడంతో.. సీఎం కేజ్రీవాల్ వారిని మంత్రి పదవీ నుంచి తప్పించారు.

బీజేపీ తీర్థం

బీజేపీ తీర్థం

గతేడాది ఆగస్ట్‌లో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ నేతృత్వంలో బీజేపీలో కపిల్ మిశ్రా చేరారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కపిల్ మిశ్రా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నినాదంతో ముందుకెళ్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాల మేరకు పనిచేస్తామని తెలిపారు.

English summary
Election Commission Showcause Notice to BJP leader Kapil Mishra for 'India vs Pak' Remark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X