• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపే ఆ అద్భుతం.. కరోనా వారియర్స్‌కు త్రివిధ దళాల సలాం.. ఆకాశం నుంచి పూలవర్షం..

|

కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలిపేందుకు త్రివిధ దళాలు సన్నద్దమవుతున్నాయి. కష్ట కాలంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు,పోలీసులు,మీడియాకు వినూత్న రీతిలో త్రివిధ దళాలు సంఘీభావం ప్రకటించనున్నాయి. ఈ మేరకు కోవిడ్-19 ఆసుపత్రులపై యుద్ద విమానాల నుంచి పూల వర్షం కురిపించడంతో పాటు.. తీర ప్రాంతంలోని యుద్దనౌకలను విద్యుద్దీపాలతో అలంకరించి సంఘీభావం ప్రకటించేందుకు డిఫెన్స్ సిద్దమవుతోంది.ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన కీలక విషయాలను ఒకసారి పరిశీలిద్దాం..

    Salute COVID-19 Warriors: Watch Indian Navy Ships Rehearsals at RK Beach In Visakhapatnam

    showering rose petals to illuminating naval vessels Here is how armed forces will salute corona warriors
    • దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోని పోలీస్ స్మారక స్థూపాల వద్ద పూలదండలతో నివాళి అర్పించడంతో డిఫెన్స్ తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది.
    • ఢిల్లీలోని పోలీస్ అమరవీరుల స్మారక స్థూపంతో పాటు అక్కడి పలు కోవిడ్-19 ఆసుపత్రులపై ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్స్ ఉదయం 9గంటలకు పూలవర్షం కురిపిస్తాయి.
    • భారత వైమానిక దళ యుద్ద విమానాలు,ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్టులు ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు దేశవ్యాప్తంగా చాలావరకు పట్టణాలు,నగరాలను కవర్ చేస్తూ వైమానిక ప్రదర్శనలు నిర్వహిస్తాయి.
    • శ్రీనగర్ టు తిరువనంతపురం(ఉత్తరాది నుంచి దక్షణాది),దిబ్రుఘర్ టు కచ్(తూర్పు నుంచి పడమరకు) ఉన్న అన్ని ప్రధాన పట్టణాలను ఫ్లై-పాస్ట్ కవర్ చేస్తుంది.
    • ఇండియన్ ఎయిర్‌ఫోర్స్,ఇండియన్ నేవీకి చెందిన విమానాలు,చాపర్స్ కోవిడ్-19 ఆసుపత్రులపై పూలవర్షం కురిపిస్తాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్,దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి,జీటీబీ ఆసుపత్రి,లోక్‌నాయక్ ఆసుపత్రి,ఆర్ఎంఎల్ ఆసుపత్రి,సఫ్‌దర్‌గంజ్ ఆసుపత్రి,గంగరామ్ ఆసుపత్రి,బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రి,మాక్స్ సాకేత్,రోహిణి ఆసుపత్రి,అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రి,ఆర్మీ ఆసుపత్రులపై పూలవర్షం కురిపిస్తారు.
    • దాదాపు 10 హెలికాప్టర్స్ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఉన్న వివిధ కోవిడ్-19 ఆసుపత్రులపై పూలవర్షం కురిపిస్తాయి.
    • సుఖోయ్ -30 ఎంకేఐ, మిగ్ -29 మరియు జాగ్వార్‌ల యుద్ధ విమానాలు ఢిల్లీలోని రాజ్‌పథ్ మీదుగా ఎగురుతాయి. కొన్ని విమానాలు కేవలం 500 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి.
    • కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల బయట మిలిటరీ బ్యాండ్స్ దేశభక్తి గీతాలను ప్లే చేస్తాయి.
    • 46 నావికాదళ నౌకలు,25 ప్రదేశాలలో, 7,516 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి ఫైర్ గ్రీన్ లైటింగ్‌తో సంఘీభావం ప్రకటిస్తాయి. అలాగే సౌండ్ సైరెన్ మోగిస్తాయి.
    • వెస్ట్రన్ నావల్ కమాండ్ ముంబైలోని గేట్‌ వే ఆఫ్ ఇండియా నుండి సాయంత్రం 7:30 నుంచి 11:59 PM వరకు ఐదు నావికాదళ నౌకలు విద్యుద్దీపాలతో ప్రకాశిస్తాయి.
    • తూర్పు నావల్ కమాండ్ విశాఖపట్నం తీరంలో రాత్రి 7:30 నుంచి అర్ధరాత్రి వరకు రెండు నౌకలు విద్యుద్దీపాలతో ప్రకాశిస్తూ సంఘీభావం ప్రకటిస్తాయి.

    English summary
    From showering rose petals over hospitals treating Covid-19 patients to illuminating naval vessels, the armed forces on Sunday through various military gestures will salute the coronavirus warriors.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X