వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిరం నిర్మాణానికి అందిన విరాళాలు ఎంతో తెలుసా? విదేశీ డొనేషన్లను ఎందుకు స్వీకరించట్లేదు?

|
Google Oneindia TeluguNews

అయోధ్య: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పావన పుణ్యక్షేత్రం అయోధ్య. శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో భారీ ఆలయ నిర్మాణానికి కొద్దిసేపట్లో పునాదిరాయి పడబోతోంది. చరిత్రలో చెరిగిపోని విధంగా ఈ ఆలయం రూపుదిద్దుకోనుంది. ఆలయ నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఆలయ నమూనా త్రీడీ ఇమేజ్‌లను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది కూడా. ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాాలు అందుతున్నాయి.

మన కాలపు మహాద్భుత ఘట్టం: శతాబ్దాల నాటి కల సాకారం: ముందే వచ్చిన దీపావళిమన కాలపు మహాద్భుత ఘట్టం: శతాబ్దాల నాటి కల సాకారం: ముందే వచ్చిన దీపావళి

పలువురు దాతలు వివిధ రూపాల్లో ఆలయ నిర్మాణానికి తమవంతు విరాళాలను అందిస్తున్నారు. కొందరు నగదు రూపంలో, మరి కొందరు వస్తవులు రూపంలో డొనేషన్లను తీర్థ క్షేత్ర ట్రస్టుకు పంపిస్తున్నారు. మరికొందరు దాతలు బంగారు, వెండి ఇటుకలను విరాళాలుగా అందజేస్తున్నారు. ఆలయ నిర్మాణం కొనసాగే కొద్దీ..విరాళాలు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయి. నగుదు, వస్తు రూపేణా దేశీయ విరాళాలను మాత్రమే సేకరిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

Shri Ram Janmbhoomi Teerth Kshetra Received Donations Of Over Rs 30 Cr So Far

మంగళవారం నాటికి రామమందిరం నిర్మాణానికి 30 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఇంత భారీ మొత్తం జమ కావడం విశేషం. బుధవారం సాయంత్రానికి మరో 11 కోట్ల రూపాయల విరాళాలు అందుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మొరారి బాపు సారథ్యంలో విరాళల సేకరణ కొనసాగుతోందని తెలిపారు.

భూమిపూజ సందర్భంగా 11 కోట్ల రూపాయల విరాళాలు తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందుతాయని గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ప్రస్తుతానికి తాము విదేశాల నుంచి ఎలాంటి డొనేషన్లను స్వీకరించట్లేదని చెప్పారు. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ చట్టం-2010 ప్రకారం.. తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఇంకా సర్టిఫికేషన్ అందాల్సి ఉందని అన్నారు. ఎఫ్‌సీఆర్ఏ సర్టిఫికేట్ అందిన తరువాతే విదేశాల నుంచి విరాళాలను స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

Ram Mandir Bhoomi Pujan: Ayodhya's Grand Ram Temple Look Revealed!

విదేశాల నుంచి స్వచ్ఛందంగా ఏడు కోట్ల రూపాయల మేర విరాళాలు అందగా.. వాటిని స్వీకరించలేదని తెలిపారు. ఆ మొత్తాన్ని వెనక్కి పంపలేదని, అలాగే నిలిపి ఉంచామని గోవింద్ దేవ్ గిరి చెప్పారు. విదేశీ విరాళాలను సేకరించడానికి అసరమైన అనుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన వెంటనే ఏడు కోట్ల రూపాయలను స్వీకరిస్తామని తెలిపారు. అనుమతి లభించిన తరువాతే విదేశీ విరాళాలపై దృష్టి సారిస్తామని అన్నారు. ప్రస్తుతానికి దేశీయంగా డొనేషన్లను సేకరిస్తున్నట్లు చెప్పారు.

English summary
Shri Ram Janmbhoomi Teerth Kshetra has received donations of over Rs 30 crores as of August 4, said Trust treasurer Swami Govind Dev Giri on Tuesday. "As per my estimate, Shri Ram Janmbhoomi Teerth Kshetra has received over Rs 30 crores as of August 4. By tomorrow we will have an additional fund of Rs 11 crores, raised by Morari Bapu from people residing in India," Giri told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X