వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృతిహాసన్‌పై దాడి: వ్యక్తి అరెస్ట్, బెదిరించేందుకు కాదని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shruti Haasan'
ముంబై: ముంబై బాంద్రాలోని నటి శృతి హాసన్ పైన దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖేగా పోలీసులు గుర్తించారు. ఫిల్మ్ సిటీలో స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నాడు. 45 ఏళ్ల అశోక్‌ను అదుపులోకి తీసుకున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ శివాజీ కోలేకర్ శనివారం విలేకరులకు తెలిపారు.

తన సోదరుడికి ఉద్యోగం అడిగేందుకు తాను శృతి హాసన్ ఇంటికి వెళ్లగా ఆమె భయంతో తలుపు పెట్టుకుందని నిందితుడు చెబుతున్నట్లుగా పోలీసులు చెప్పారు. తనకు ఆమెను బెదిరించాల్సిన అవసరం లేదని చెప్పాడని తెలిపారు.

బాంద్రా పోలీసుల ప్రకారం... ఈ ఘటన మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. శృతి బాంద్రాలోని ఆరో ఫ్లోర్‌లోని తన అపార్టుమెంటులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఇరవై ఏడేళ్ల శృతి తన ఇంట్లోకి అశోక్ చొచ్చుకొని వచ్చినట్లు చెప్పింది. తనను గుర్తు పట్టలేదా అని అతను ఆమెను అడిగాడు. అంతేకాకుండా ఆమె భుజాల పైన చేతులు వేశాడు. దీంతో బెదిరిపోయిన శృతి అతనిని బయటకు నెట్టేసి తలుపు పెట్టేసుకుంది. పోలీసులు నిందితుడి పైన 354, 452, 345 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
A spot boy was today arrested from central Mumbai in connection with stalking and trespassing at actress Shruti Haasan's house in suburban Bandra, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X