• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియుడు మోసం చేస్తే నర్సును నిలువునా ముంచేసిన ఎస్ఐ, కడుపు చేసి కాలక్షేపం, అసలు ఏం జరిగిందంటే?

|

చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చూస్తూ యువతి చాలా సంతోషంగా ఉంటోంది. అదే సమయంలో ప్రియుడు మోసం చేశాడని ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతికి ఎస్ఐ పరిచయం అయ్యాడు. అంతే యువతిని వలలో వేపుకున్న ఎస్ఐ ఆమెతో ఎంజాయ్ చేశాడు. యువతి గర్భవతి అయ్యింది.

యువతి అబార్షన్ చేయించిన ఎస్ఐ నువ్వు మర్యాదగా ఎవరినైనా పెళ్లి చేసుకో ? నేను ఇప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తాను అంటూ ఎదురుతిరిగాడు. తనను ఎస్ఐ మోసం చేశాడని ఆ యువతి ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతే రాత్రి నిద్రమాత్రలు మింగిన యువతి మూడు పేజీల డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో కలకలం రేపింది.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

కన్యాకుమారీ టూ కేరళ

కన్యాకుమారీ టూ కేరళ

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కుజితురై ముక్కోడు ప్రాంతానికి చెందిన జోస్పిన్ (31) అనే యువతి నర్సింగ్ పూర్తి చేసింది. కన్యాకుమారి నుంచి కేరళలోని తిరువనంతపురం చేరుకున్న జోస్పిన్ అక్కడ ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తూ చాలా సంతోషంగా గడిపేది.

మోసం చేసిన ప్రియుడు

మోసం చేసిన ప్రియుడు

జోస్పిన్ కు మోక్ డోనాల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వలవేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువకుడు జోస్పిన్ కు మాయమాటలు చెప్పాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మిన జోస్పిన్ అతను ఏమి చెప్పినా సరే అని తలఊపేది. అంతే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు జోస్పిన్ తో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర లక్షల రూపాయల డబ్బులు, బంగారు నగలు తీసుకుని మోసం చేసి మాయం అయ్యాడు.

మీరే న్యాయం చెయ్యలి

మీరే న్యాయం చెయ్యలి

డబ్బులు, నగలు తీసుకుని మోసం చేసిన ప్రియుడి మీద ఫిర్యాదు చెయ్యడానికి జోస్పిన్ బలూకర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్ఐగా పని చేస్తున్న సుశీంద్రన్ అలియాస్ సుందరలింగం (33) ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన జోస్పిన్ మీద కన్ను వేశాడు. నీకు న్యాయం చేస్తానని, నువ్వు భయపడకూడదని, ప్రియుడు మోసం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎస్ఐ సుశీంద్రన్ జోస్పిన్ కు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చేశాడు. జోస్పిన్ ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో విచారణ పేరుతో నేరుగా యువతి ఇంటికి వెళ్లిన ఎస్ఐ సుశీంద్రన్ ఆమెతో ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశాడు.

నేను ఎస్ఐ, నువ్వు జస్ట్ నర్సు మాత్రమే

నేను ఎస్ఐ, నువ్వు జస్ట్ నర్సు మాత్రమే

ఎస్ఐ సుశీంద్రన్ కారణంగా జోస్పిన్ గర్భవతి అయ్యింది. తాను గర్భతి అయ్యానని, పెళ్లి చేసుకోవాలని జోస్పిన్ చెప్పడంతో ఎస్ఐ సుశీంద్రన్ షాక్ కు గురైనాడు. తనకు కొన్ని ఇంటి సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తీరిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని, ప్రస్తుతానికి నువ్వు అబార్షన్ చేసుకోవాలని జోస్పిన్ కు ఎస్ఐ సుశీంద్రన్ మాయమాటలు చెప్పాడు. తరువాత కన్యాకుమారిలోని ఓ ఆసుపత్రికి జోస్పిన్ ను తీసుకెళ్లి అబార్షన్ చేయించిన ఎస్ఐ సుశీంద్రన్ ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

 కలెక్టర్, ఎస్పీకి చెప్పినా దిక్కులేదు

కలెక్టర్, ఎస్పీకి చెప్పినా దిక్కులేదు

ఎస్ఐ సుశీంద్రన్ మోసం చెయ్యడంతో జోస్పిన్ షాక్ కు గురై ఇటీవల కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఐ సుశీంద్రన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ ఆఫీసు ముందు జోస్పిన్ ధర్యా చేసింది. ఆ సమయంలో మధర్ స్వచ్చంద సంస్థ జోస్పిన్ కు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అధికారులు ఎస్ఐ సుశీంద్రన్ ను వేరే పోలీస్ స్టేషన్ కు బదిలి చేసి అతని మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు.

  Sekhar Kammula's Father Seshayya Is No More || Oneindia Telugu
  డెత్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగేసింది

  డెత్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగేసింది

  తనను మోసం చేసిన ఎస్ఐ సుశీంద్రన్ మీద ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని కలత చెందిన జోస్పిన్ తన ఆత్మహత్యకు ఎస్ఐ కారణం అంటూ మూడు పేజీల డెత్ నోట్ రాసి రాత్రి ఇంట్లో మోతాదుకుమించి నిద్రమాత్రలు మింగేసింది. ఇంట్లో స్పృహలేని స్థితిలో పడి ఉన్న జోస్పిన్ ను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తక్కలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోస్పిన్ ను మోసం చేసి తప్పించుకున్న ఎస్ఐ సుశీంద్రన్ ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మధర్ స్వచ్చంద సంస్థతో పాటు కన్యాకుమారిలోని పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. జోస్పిన్ ను మోసం చేసింది ఎస్ఐ కాబట్టి ఆమెకు పోలీసు అధికారులు న్యాయం చెయ్యడంలేదని ఆరోపిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి.

  English summary
  SI love: Kannykumari young woman abused by Sub Inspector, and attempted suicide in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X