వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రంగు మారిన సియాంగ్ నీరు, మృత్యువాత పడ్డ చేపలు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌ను ఇబ్బందులు పెట్టేందుకు చైనా తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. ఇండియాలోని నదులను లక్ష్యంగా చేసుకొని చైనా దొంగ దెబ్బ తీస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు జీవధారగా పేరొందిన సియాంగ్ నది నీరు నల్లరంగులోకి మారింది. ఈ నది నీరు రంగు మారడంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని విద్యార్థులు మోడీకి లేఖ రాశారు.

షాక్: '42 యాప్‌లతో చైనా గూఢచర్యం', ఆ యాప్‌లివే!షాక్: '42 యాప్‌లతో చైనా గూఢచర్యం', ఆ యాప్‌లివే!

అరుణాచల్ ప్రదేశ్‌కు తాగు, సాగు నీటిని అందించే సియాంగ్ నది నీరు కలుషితం కావడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నది నీటిలో చైనా పారిశ్రామిక వ్యర్థాలను కలపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

చైనా-పాక్ కారిడార్‌‌: ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధం?: మైఖేల్‌ కూగల్‌మెన్‌ సంచలనంచైనా-పాక్ కారిడార్‌‌: ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధం?: మైఖేల్‌ కూగల్‌మెన్‌ సంచలనం

ఈ నది నీరు నల్లగా మారడం ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ నీరు ఎందుకు కలర్ మారిందనే విషయమై తెలుసుకొనేందుకు నీటిని ల్యాబ్‌కు పంపారు.

చైనా-పాక్ కారిడార్: రూట్ మార్పుకు నో చెప్పిన డ్రాగన్చైనా-పాక్ కారిడార్: రూట్ మార్పుకు నో చెప్పిన డ్రాగన్

 నల్ల రంగులోకి సియాంగ్ నది నీరు

నల్ల రంగులోకి సియాంగ్ నది నీరు

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగు నీటిని అందించే సియాంగ్ నది కలర్ పూర్తిగా మారిపోయింది. నల్ల రంగులోకి నది నీరు మారాయి. ఈ నీటిని వాడితే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పారిశ్రామిక వ్యర్థాల కారణంగానే ఈ నది నీరంతా కలర్ మారిపోయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

 ఒడ్డుకు కొట్టుకు వచ్చిన జలచరాలు

ఒడ్డుకు కొట్టుకు వచ్చిన జలచరాలు

బుదవారం నాడు సియాంగ్ నది జలాలు పూర్తిగా నలుపు రంగులోకి మారడాన్ని స్థానికులు గుర్తించారు.ఈ నీరు కలుషితమైంది. దీంతో నీటిలోని చేపలు మరణించాయి. మరణించిన చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఈ నీటిని తాగితే ప్రజలు మరణించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నీటిని వాడకూడదని హెచ్చరించారు.

 వ్యర్థాలను నేరుగా నదిలోకి

వ్యర్థాలను నేరుగా నదిలోకి

ఖనిజం నుంచి లోహాలను వేరుచేయగా మిగిలిన శేషపదార్థాన్ని ఈ నీటిలోకి వదిలినట్టుగా ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. చైనా నుంచి ప్రవహించే ఈ నదికి సమీపంలో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. అందులోని వ్యర్థాలను నదిలోకి వదిలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

 నీటిని ల్యాబ్ పంపిన అధికారులు

నీటిని ల్యాబ్ పంపిన అధికారులు

ఈ నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.ప్రతి ఏడాది రుతువులు మారే సమయంలో నదిలోని నీరు కొద్దిగా రంగు మారడం సహజమే అయినా.. ఈ స్థాయిలో మార్పుకు గురవడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విద్యార్థులు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు.

English summary
The sudden change of the water of Siang River in Arunachal Pradesh from crystal clear to thick dark black containing large volume of heavy slag has created panic in the frontier state that borders China.భారత్‌ను ఇబ్బందులు పెట్టేందుకు చైనా తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. ఇండియాలోని నదులను లక్ష్యంగా చేసుకొని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X