వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం పని చేశారని బీజేపీకి మీరు ఓటు వేస్తారో అర్థం కావడం లేదు, మాజీ సీఎం, వివాదాస్పదం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అభివృద్ది పనులు మాత్రం మేము చేస్తాము, అయితే మీరు ఓటు మాత్రం నరేంద్ర మోడీ (బీజేపీ)కి వేస్తారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బాదామి శాసన సభ నియోజక వర్గంలోని ఆలూర ఎస్ కే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా సమావేశంంలో మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడారు.
సిద్దరామయ్య సొంత నియోజక వర్గం బాదామిలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటు ఎందుకు చేస్తారు ?

ఓటు ఎందుకు చేస్తారు ?

తాను అనేక నిధులు మంజూరు చేసి మీ నియోజక వర్గంలో అభివృద్ది పనులు చేస్తున్నానని సిద్దరాయ్య చెప్పారు. అయితే మీరు మాత్రం మాకు ఓటు వెయ్యకుండా బీజేపీకి ఎందుకు వేస్తున్నారో అర్దం కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరాయ్య విచారం వ్యక్తం చేశారు.

నువ్వు బీజేపీ కార్యకర్త కదా !

నువ్వు బీజేపీ కార్యకర్త కదా !

బహిరంగ సభను ఉద్దేశించి సిద్దరామయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో జోక్యం చేసుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య ఏయ్ ఎవరు నువ్వు, బీజేపీ కార్యకర్త కాదా ? అతి చెయ్యకుండా కుర్చో అంటూ అసహనం వ్యక్తం చేశారు. సిద్దరాయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న బాదామి నియోజక వర్గంలో గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 9 వేల ఓట్లు ఆధిక్యం రావడంతో ఆయన స్థానికులను ఇలా ప్రశ్నిస్తున్నారు.

నేను మాట్లాడను

నేను మాట్లాడను

మీరు మాత్రం నరేంద్ర మోడీకి ఓట్లు వేస్తారు, ఇప్పుడు వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని మమ్మల్ని ఎలా నిలదీస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా స్పందించడానికి మాజీ సీఎం సిద్దరామయ్య నిరాకరించారు. సీఎం కుమారస్వామి ఎలాంటి సందర్బంలో అలా మాట్లాడారో తెలీదని, ఆ విషయం తెలీకుండా మాట్లాడటం మంచిది కాదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే ధర్నా చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన సీఎం కుమారస్వామి ఇప్పటికే వారికి క్షమాపణలు చెప్పారని, ఈ విషయంపై ఇంకా మట్లాడటం ఏమిటని మీడియాను ప్రశ్నించారు.

జ్యోతిష్యుడు కాదు !

జ్యోతిష్యుడు కాదు !

కర్ణాటకలో మధ్యంతర శాసన సభ ఎన్నికలు వస్తాయి అంటూ జేడీఎస్ నాయకుడు బసవరాజ్ హోరట్టి చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కర్ణాటకలో శాసన సభకు మధ్యంతర ఎన్నికలు రావని సిద్దరామయ్య స్పష్టం చేశారు. జేడీఎస్ నాయకుడు బసవరాజ్ హోరట్టి ఏమైనా జోతిష్యుడా ? ఆయన చెప్పినవన్ని జరిగిపోవడానికి అని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు.

అదే కారణం కాదు !

అదే కారణం కాదు !

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కర్ణాటకలో జేడీఎస్ తో పెట్టుకోవడం ప్రధాన కారణం కాదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవడం వలనే మనం ఓడిపోయామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారని సిద్దరామయ్య చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్లి బలోపేతం కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త పని చెయ్యాలని మాజీ సీఎం సిద్దరామయ్య బాదామి ప్రజలకు మనవి చేశారు.

English summary
Former CM Siddaramaiah in Badami said, 'our government did development with various projects but you people are voting for BJP, i don't understand why it is'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X