వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ప్రచారంలో టంగ్ స్లిప్: నరేంద్ర మోడీకి సిద్ధరామయ్య ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన పొరపాటును ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని చెప్పబోయి బీజేపీ నేత యెడ్యూరప్పపై విమర్శలు చేశారు అమిత్ షా.

ఇప్పుడు సిద్ధరామయ్య స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర స్వామిని ప్రశంసించబోయి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆయన నాలుక స్లిప్‌ అయ్యింది. సిద్ధరామయ్య తమ పార్టీ నేత నరేంద్ర స్వామి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నరేంద్ర స్వామి అనబోయి పొరపాటుగా నరేంద్ర మోడీ అన్నారు.

టీవీ5 సర్వే, కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కర్నాటక బీజేపీదే, ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.., యెడ్డీ సీఎంటీవీ5 సర్వే, కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కర్నాటక బీజేపీదే, ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.., యెడ్డీ సీఎం

Siddaramaiah makes gaffe, praises PM Modi during rally

నరేంద్ర స్వామిని ప్రశంసించబోయి నరేంద్ర మోడీగా పేర్కొని ప్రశంసించారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం తదితర పనులు నరేంద్ర మోడీ, తమ ప్రభుత్వం వల్లే జరిగాయన్నారు.

వెంటనే స్వామి కలగజేసుకోవడంతో సిద్ధరామయ్య నాలుక కరుచుకుని సారీ సారీ.. నరేంద్ర స్వామి అన్నారు. నరేంద్ర అనే పదం ముఖ్యమైనదన్నారు. స్వామి ఇక్కడ ఉన్నారని, మోడీ గుజరాత్‌లో ఉన్నారని, నరేంద్ర మోడీ ఫిక్షన్‌, నరేంద్ర స్వామి నిజమని తప్పును సరిదిద్దుకున్నారు.

అంతకుముందు, ప్రచారంలో మోడీపై సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. మోడీ గొప్ప నటుడిలా చాలా బాగా ప్రసంగిస్తారని, అయితే ప్రసంగాలతో కడుపు నిండదన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేయాలనే అంశంలో ఆయన నిమగ్నమయ్యారని చెప్పారు.

English summary
Karnataka CM Siddaramaiah, while addressing a rally in Karnataka, ended up praising PM Narendra Modi as he was speaking about a Congress candidate- Narendra Swamy. This development came just day after he sent a legal notice for criminal and civil defamation to BJP, PM Modi, BJP chief Amit Shah and their chief ministerial candidate BS Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X