వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దరామయ్య ఈజ్ బ్యాక్: అనుచరుడి చెంప చెల్లుమనిపించిన మాజీ ముఖ్యమంత్రి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వివాదాస్ప వ్యాఖ్యలు చేసి దృష్టి తనవైపునకు మరల్చుకుంటారు. తాజాగా అందరూ చూస్తుండగానే సిద్ధరామయ్య తన అనుచరుడిపై చేయి చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

రెండు రోజులే డెడ్ లైన్..చిన్నాన్న హత్య కేసు తేల్చాలి : సీఎం జగన్ ఫైర్: రంగంలోకి డీజీపీ..!!రెండు రోజులే డెడ్ లైన్..చిన్నాన్న హత్య కేసు తేల్చాలి : సీఎం జగన్ ఫైర్: రంగంలోకి డీజీపీ..!!

మైసూరు ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య ఆ తర్వాత కారుదగ్గరకు వెళుతుండగా తన అనుచరుడు ఫోన్‌లో మాట్లాడుతూ కనపించాడు. ఇది మాజీ ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో వెంటనే తన చేయికి పనిచెప్పాడు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య అనుచరుడి చెంపను పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మైసూరులో వరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధరామయ్య వెళ్లారు. డీకే శివకుమార్ అరెస్టు నేపథ్యంలో తలమునకలై ఉన్న కాంగ్రెస్ పార్టీకి.... సిద్ధరామయ్య వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది.

Siddaramaiah once again in news for slapping his follower

సిద్ధరామయ్య ఇలా వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలవడం తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఓ పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. 2016లో ఓ బ్యూరోక్రాట్‌ చెంపపగలగొట్టి వార్తల్లో నిలిచారు. బళ్లారిలో వాల్మికీ భవన్‌లో ఈఘటన చోటుచేసుకుంది. అయితే మీడియా తన చర్యను వక్రీకరిస్తోందంటూ బుకాయించారు సిద్ధరామయ్య. ఇప్పటికే డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేయడంతో కర్నాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్నాటక రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఇదిలా ఉంటే ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది.

English summary
In a shocking incident, Congress leader and former Karnataka Chief Minister Siddaramaiah was seen slapping a party worker outside Mysore Airport on Tuesday. The Congress worker had been passing a phone to Siddharamaiah, which angered the leader who then struck him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X