వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా, గవర్నర్‌కు సమర్పణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ విజ్‌భాయ్ వాలాకు మంగళవారం నాడు సాయంత్రం సమర్పించారు.

కర్ణాటక రాష్ట్రంలో మే 12న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే కాంగ్రెస్, జెడి (ఎస్ )మధ్య అవగాహన కుదిరింది. జెడి(ఎస్) కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఈ మేరకు జెడి(ఎస్)కు కూడ అంగీకారం తెలిపింది. ఈ రెండు పార్టీలు గవర్నర్ ను కలవనున్నాయి.

Siddaramaiah resigns to Cm post

మరోవైపు సిద్దరామయ్య మంగళవారం నాడు సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపధ్దర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ విజ్‌భాయ వాలా కోరారు.

మరో వైపు ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య కొనసాగారు. సిద్దరామయ్య ఐదేళ్ళ పాటు సీఎంగా కొనసాగారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేదు. దీంతో బిజెపిని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు జెడి(ఎస్)కు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిని ఇస్తామని ప్రతిపాదించింది.

English summary
Karnatak chief minister Siddaramaiah resigned to Cm post on Tuesday evening. He submitted his resignation letter to governor at Rajbhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X