వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీడే సీఈఓగా సిద్దార్థ సతీమ‌ణి మాళవిక హెడ్గే -అప్పులు తీర్చుతూ, భర్త కలల కంపెనీని నిలబెట్టేలా..

|
Google Oneindia TeluguNews

ప్రఖ్యాత కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) సంస్థ తమ తర్వాతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ‌గా మాళవిక హెగ్డేను నియమించింది. సీడీఈఎల్ వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్ధార్థ సతీమణి అయిన మాళవిక కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మోదీకి జగన్ భారీ షాక్:'భారత్ బంద్'కు వైసీపీ మద్దతు -రైతుల పోరుకు రెస్పెక్ట్ -చంద్రబాబుపైనా తూటాలుమోదీకి జగన్ భారీ షాక్:'భారత్ బంద్'కు వైసీపీ మద్దతు -రైతుల పోరుకు రెస్పెక్ట్ -చంద్రబాబుపైనా తూటాలు

 ఆమెకుతోడు మరో ముగ్గురు..

ఆమెకుతోడు మరో ముగ్గురు..

కాఫీడే సీఈవోగా మాళవిక హెడ్గేతోపాటే నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ల సామర్థ్యంలో కంపెనీ ముగ్గురు అదనపు డైరెక్టర్లను నియమించినట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దాఖలు చేశామని కాఫీ డే సంస్థ పేర్కొంది. కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిలను నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారు.

 సిద్ధార్థ హఠాన్మరణంతో..

సిద్ధార్థ హఠాన్మరణంతో..

గతేడాది కాఫీడే అధినేత వీజీ సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి మాళవిక.. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. 2019 జూలైలో సిద్ధార్థ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోగా.. ఆత్మహత్యే ఆయన మరణానికి కారణమని అంతా భావిస్తున్నారు. సిద్ధార్థ మరణించే సమయానికే కంపెనీకి అప్పుల భారం మొదలుకాగా, ఆయన చనిపోయిన నాటి నుంచి గత ఏడాదిగా అప్పులు తీర్చే ప్రయత్నాల్లో సీడీఈఎల్ తలమునకలవుతూ వస్తోంది.

లక్ష మందికి ఉపాధినిస్తూ..

లక్ష మందికి ఉపాధినిస్తూ..

కాఫీడే సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడిన సమయంలో వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మోదీ సర్కార్ రిలయన్స్, అదానీ లాంటి కొన్ని వ్యాపార సంస్థలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తూ, మిగతా పారిశ్రామిక వేత్తల్ని వేధిస్తోందని, అధిక పన్నులు, అనవసర నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తోందని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఉదంతాల తర్వాత బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వ్యాపార వేత్తల్ని దొంగలుగా చిత్రీకరించడం పెరిగిందని పేరు పొందిన పారిశ్రామిక వేత్తలు బాహాటంగా విమర్శలు చేశారు. సిద్ధార్థ మరణం తర్వాత ఇంకాస్త నష్టాల్లో కూరుకుపోయిన కాఫీడేను మాళవిక ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. కాఫీ పరిశ్రమలో అద్భుతంగా రాణించిన సిద్దార్థ.. తన అమల్గామేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్, కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించారు.

ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?

English summary
Coffee Day Enterprises Ltd (CDEL) said on Monday that Malavika Hegde, the wife of its late founder V G Siddhartha, has been appointed as the company's Chief Executive Officer. Siddhartha's sudden demise had shaken the business world last year. Malavika, who is the daughter of former Karnataka Chief Minister S M Krishna, has said in the past that she remains fully committed to paring down the multi-crore debt burden of the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X