వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ సీఎం .. లేదంటే పీసీసీ చీఫ్ ... హైకమాండ్‌కు సిద్దూ అల్టిమేటం, మోకాలడ్డిన అమరిందర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వంలో సీఎం అమరిందర్ సింగ్ వర్సెస్ మంత్రి నవజ్యోత్ ‌సింగ్ సిద్దూ మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజీకి చేరింది. ఒకరిపై ఒకరు అధిపత్యం ప్రదర్శించేందుకు హైకమాండ్‌పై తమ శక్తి మేరకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల సిద్దూ మంత్రి పదవులను సీఎం అమరిందర్ సింగ్ మార్చడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో తనకు పార్టీలో లేదంటే ప్రభుత్వంలో కీలక పదవీ ఇవ్వాలని బెట్టుచేస్తున్నారు సిద్దూ.

డిప్యూటీ సీఎం పదవీ ..?

డిప్యూటీ సీఎం పదవీ ..?

సిద్దూ నుంచి కీలకశాఖలను అమరిందర్ సింగ్ తీసుకోవడంతో .. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. తన శాఖలు మార్చినందున పంజాబ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు రాహుల్ గాంధీ అంగీకరించలేదని విశ్వసనీయ సమాచారం. అయితే తనకు పార్టీ చీఫ్ పదవీ ఇవ్వాలని బెట్టు చేసినట్టు తెలిసింది. దీనికి రాహుల్ నుంచి హామీ వచ్చినట్టు తెలిసింది. అయితే ఇంతలో సీఎం అమరిందర్ కల్పించుకొని .. సిద్దూకు కీలక పదవీ అప్పగించే ప్రక్రియలో అడ్డుపడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Recommended Video

సీడ్ కాంగ్రెస్ 26 నుంచి - మంత్రి నిరంజన్ రెడ్డి
పీసీసీ చీఫ్ పోస్ట్ ..?

పీసీసీ చీఫ్ పోస్ట్ ..?

పంజాబ్ విద్యుత్ మంత్రి పదవీతోపాటు పీసీసీ చీఫ్ పదవీ ఇస్తామని రాహుల్ స్పష్టంచేసినట్టు తెలిసింది. వాస్తవానికి సిద్దూను జాతీయ రాజకీయాల్లోకి రావాలని రాహుల్ కోరానని .. అయితే అందుకు సిద్దూ అంగీకరించలేదని విశ్వసనీయ సమాచారం. తనకు రాష్ట్రంలోనే కీలక పదవీ ఇవ్వాలని కోరగా .. రాహుల్ కూడా ఓకే చెప్పారని సిద్దూ సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల గురుదాస్ పూర్ లోక్ సభ నుంచి పోటీచేసిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్.. సన్నీ డియోల్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేశారు. తన సన్నిహితుడు సునీల్ రాజీనామాతో ఒకింత ఆందోళనకు గురయ్యారు అమరిందర్ సింగ్. వెంటనే రాహుల్ గాంధీతో మాట్లాడి .. రాజీనామాను తిరస్కరించాలని కోరారు. సునీల్‌నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

అక్కడ మొదలైంది ...

అక్కడ మొదలైంది ...

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత సింగ్, సిద్దూ మధ్య వివాదం మరింత ముదిరింది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్దూ బాధ్యత వహించాలని అమరిందర్ సింగ్ అనడంతో వివాదం పీక్ స్టేజీకి చేరింది. తర్వాత క్యాబినెట్ సమావేశానికి సిద్దూ డుమ్మకొట్టడం .. ఇదే అదనుగా భావించి, సిద్దూ శాఖలు మార్చడంతో చకచకా రాజకీయ పరిణామాలు మారిపోయింది. దీంతో ఇష్యూ రాహుల్ వద్దకు చేరింది. పంజాబ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని సిద్దూ పట్టుబట్టగా .. రాహుల్ నిరాకరించినట్టు సమాచారం. కాంగ్రెస్ చీఫ్ పదవీపై హామీనిచ్చారు. కానీ అమరిందర్ సింగ్ రూపంలో మరోసారి అడ్డుపుల్ల పడింది. మాజీ పీసీసీ చీప్ సునీల్‌ను కొనసాగించాలని ఆయన రాహుల్‌కు విజ్ఞప్తి చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇంతకీ ఎవరి వైపు రాహుల్ మొగ్గుచూపుతారో చూడాలి.

English summary
the tussle between Punjab Congress leader Navjot Singh Sidhu and Chief Minister Capt Amarinder Singh refuses to die down even weeks after the Lok Sabha elections results. Now, Sidhu has apparently demanded the Deputy CM post or the Punjab Congress chief's post along with the power ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X