వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట నిలబెట్టుకోండి.. రాజకీయాల నుంచి తప్పుకోండి.. సిద్దూను ఆటాడుకుంటున్న నెటిజన్స్

|
Google Oneindia TeluguNews

ఉత్తర్‌ప్రదేశ్ అమేథీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఓటమి సిద్దూ కొంపముంచింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనతో ఆటాడుకుంటున్నారు. మాట మీద నిలబడమని, రాజకీయాల నుంచి తప్పుకొమ్మంటూ ట్రోల్ చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ రాహుల్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌కు స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇస్తారన్న వాదనల్ని ఆయన కొట్టిపారేశారు. ఒకవేళ స్మృతి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ కంచుకోటలాంటి అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఘోర పరాజయం పొందారు. 55వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సిద్ధూతో ఆటాడుకుంటున్నారు.

Sidhu Getting Trolled By netizens For Saying He Will Quit Politics If Rahul Gandhi Lost

గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా అమేథీలో స్మృతి ఇరానీ ఆధిక్యంలోకి రాగానే సిద్ధూను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దేశం సిద్ధూ సేవలను కోల్పోనుందని ఒకరు ట్వీట్ చేస్తే.. ఎప్పుడు రాజకీయాలను వీడుతున్నారని మరొకరు సటైర్ వేశారు. రాహుల్ ఓడిపోయారు. మీరు రాజీనామా చేసే సమయం వచ్చింది. మీ రిజిగ్నేషన్ కోసం ఎదురుచూస్తున్నామని కొందరు చురకలంటిస్తే.. అప్పట్లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తల లింక్‌లను పోస్ట్ చేసిన మరికొందరు నెటిజన్లు సర్ రిమైండర్ అంటూ ట్వీట్ల దాడి చేశారు.

English summary
Rahul Gandhi was being opposed by BJP’s Smriti Irani in Amethi and a lot of people in Indian National Congress were positive Rahul Gandhi would win against her. Sidhu jee was so confident that he even went as far as to claim that he would quit politics if Rahul Gandhi didn’t win in Amethi. as rahul lost his seat from amethi netizens trolled siddu for his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X