వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?

|
Google Oneindia TeluguNews

నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు పంపారు. అయితే సిద్దూ రాజీనామ చేసిన వ్యవహారంపై పలు విమర్శలు తలెత్తాయి. రాజీనామ చేసిన లేఖను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకుండా పార్టీ అధ్యక్షుడికి పంపాడు. అది కూడ నెల రోజుల క్రితం రాసిన లేఖను ఇప్పుడు బయటపెట్టడం వెనక అయన ప్రజాస్వామ్యాం అంటే ఓ కామేడి షోగా మారిందనే విమర్శలు ఎదుర్కోంటున్నాడు.

 రాజీనామ లేఖపై సిద్దూ జిమ్మిక్కులు

రాజీనామ లేఖపై సిద్దూ జిమ్మిక్కులు

నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రముఖ క్రికెటర్, ఆ తర్వాత టీవీ షోలో యాంకర్‌గా మారాడు. అనంతరం టీవీ షోల్లో హస్యాన్ని పండించే వ్యక్తిగా అందరికి సుపరిచితుడు....పంజాబ్ నుండి ఎన్నికైన తర్వాత ఆయన పంచాయితీ రాజ్ శాఖతోపాటు సాంస్కృతిక శాఖలను చేపట్టాడు. వీటితో పాటు మరిన్ని శాఖల భాద్యతలను కూడ ముఖ్యమంత్రి అప్పగించాడు..కాని ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం వల్ల ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ క్యాబినెట్ ప్రక్షాళన చేశాడు. ఇందులో భాగంగానే సిద్ధూకు ఉన్న కొన్ని శాఖలను తొలగించి ఇతర శాఖలను అప్పగించాడు.అయితే సద్దూ మాత్రం తనకు ఇచ్చిన శాఖల భాద్యతలను చేపట్టకపోవడంతోపాటు కనీసం సెక్రటేరియట్‌కు కూడ వెళ్లని పరిస్థితి ఉంది.

కర్నాటకం : బలపరీక్షకు ముహూర్తం ఖరారు..

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

ఈనేపథ్యంలోనే పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న రాహుల్ గాంధిని కలిసేందుకు సిద్ధూ ఢిల్లికి వెళ్లారు. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ వయానాఢ్‌ పర్యటనలో ఉన్నాడు. కాగా రాహుల్ తిరిగి వచ్చేవరకు ఢిల్లీలోనే ఉన్న సిద్దూ జరిగిన పరిణామాలను రాహుల్‌కు వివరించడంతోపాటు తన రాజీనామ లేఖను కూడ సమర్పించినట్టు తెలుస్తోంది.అయితే తాను ఇచ్చిన రాజీనామ లేఖ జూన్ 10న ఉంది. అయితే సిద్దూ నిజంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తే ముఖ్యమంత్రికి లేదా, రాష్ట్ర గవర్నర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సిద్దూ మాత్రం ఇదేం చేయకుండా రాజీనామ చేస్తున్నట్టు ఉన్న లేఖను రాహుల్ గాంధీకి రాయడం వివాదాలకు కేంద్ర బిందువయింది...

రాహుల్ అనంతరం ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ..!

రాహుల్ అనంతరం ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ..!

ఇక ఇదే లేఖను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు పంపుతున్నట్టు నెల రోజుల తర్వాత ప్రకటించి అదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పేర్కోన్నాడు. దీంతో సిద్దూపై పలు విమర్శలు చేలరేగుతున్నాయి.బాధ్యతగల మంత్రిగా నెల క్రితం రాజీనామ చేసి ఇప్పటివరకు తెలపకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు తలెత్తాయి. దీంతోపాటు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే సరైన గౌరవం కూడ లేదని పలువురు మండిపడుతున్నారు.

English summary
Congress leader Navjot Singh Sidhu, who tweeted on Sunday that he had resigned from the Punjab cabinet last month, today sent his resignation to Chief Minister Amarinder Singh. Mr Sidhu quit the cabinet after he was stripped of key portfolios in cabinet reshuffle last month amid a fallout with Amarinder Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X