• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

SIFF Young Artiste:స్కాలర్షిప్‌‌ ప్రోగ్రాంకు 100 మంది ఫైనలిస్టులు ఎంపిక

|

బెంగళూరు: సంగీతం మరియు డ్యాన్స్ రంగాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రతిభా పోటీలకు సంబంధించి దేశవ్యాప్తంగా 100 మంది ఫైనలిస్టులను ఎస్‌ఐఎఫ్ఎఫ్ యంగ్ ఆర్టిస్ట్ 2020 ప్రకటించింది. 11 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికితీసేందుకు నిర్వహించిన పోటీకోసం 12000 ఎంట్రీలు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రారంభంలో పలువురు ప్రముఖులు అంజద్ అలీ ఖాన్, టెరెన్స్ లూయిస్, షోవన్ నారాయణ్, శల్మలి ఖోల్గడే మరియు అరుణా సాయిరామ్‌లు ప్రారంభించారు. ఫైనల్స్‌కు చేరుకున్న 100 మంది ఫైనలిస్టులకు రూ.25 లక్షల స్కాలర్షిప్స్‌తో పాటు మెంటార్షిప్ ప్రోగ్రాం, క్యాష్ అవార్డులను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఫైనలిస్టులకు యంగ్ ఆర్టిస్ట్ అడ్వాన్స్ ప్రోగ్రాం (YAMP)లో జాయిన్ అయ్యారు. వారున్న ప్రాంతంలోనే వారికి మెంటార్షిప్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది.

మ్యూజిక్ మరియు డ్యాన్స్‌ రంగాల్లోని నిపుణులు అయిన డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి, మాధవీ ముద్గల్‌లు మెంటార్‌గా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. వీరితో పాటు రుక్మిణి విజయ్ కుమార్ (భరతనాట్యం), అనుపమ భగ్వత్ (సితార్/సరోద్), నిఖితా గాంధీ (ఇండియన్ మరియు వెస్ట్రన్ వోకల్), సాగర్ బోరా(హిప్‌హాప్)లు కూడా పలు సెషన్లు కంటెస్టెంట్లకు తీసుకోనున్నారు. ఈ అద్భుతమైన నైపుణ్యతను ప్రదర్శించేందుకు ఫినాలే నిర్వహిస్తున్నట్లు చెప్పిన అధికారులు ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించే జరుగుతుందని వెల్లడించారు.

SIFF Young Artiste anounces 100 finalists for its scholarship programme,to be mentored by maestros

విద్యార్థుల్లోని అద్భుతమైన నైపుణ్యాన్ని గుర్తించి వెలికి తీసిన మెంటార్లకు, జ్యోరోస్‌కు ధన్యవాదాలు తెలిపారు యంగ్ ఆర్టిస్ట్ సహవ్యవస్థాపకులు కవితా అయ్యర్.యంగ్ ఆర్టిస్ట్ సీజన్ 1కు గాను దేశ నలుమూలల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని కవిత చెప్పారు. ఉజ్జయినీ నుంచి ఇంఫాల్, ఢిల్లీ నుంచి దిమా పూర్, నార్త్ 24 పరగానాస్ నుంచి ఉడిపి మరియు కోజికోడ్‌ వరకు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశం మొత్తం అన్‌లాక్‌లో ఉన్నప్పటికీ ఆడిషన్స్‌ను చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిర్వహించామని చెప్పారు. ఫైనల్‌కు వచ్చిన విద్యార్థులు తమ టాలెంట్‌ను ప్రదర్శించారని ఒక్కొక్కరూ ఒక్కో యూనిక్ స్టైల్‌లో వారిలోని నైపుణ్యతను బయటపెట్టారని చెప్పారు.

కొందరు విద్యార్థులు కళలపై అభిరుచి కలిగి ఉన్న కుటుంబాల నుంచి రాగా.. మరికొందరు కళలకు సంబంధించి ఎలాంటి నేపథ్యం లేని కుటుంబం నుంచి కూడా వచ్చారు. కొన్ని వేల సంఖ్యలో వచ్చిన ఎంట్రీలను పరిశీలించిన తర్వాత కళకు కులమతాలు లేవని, పరిధులు లేవని ఎవరైనా కళాకారుడు కావొచ్చన్న విషయం తెలిసిందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు యంగ్ ఆర్టిస్ట్ కార్యక్రమం ఒక మంచి వేదిక అవుతుందని అన్నారు ఎస్‌ఐఎఫ్ఎఫ్ ట్రస్టీ సందీప్ సింఘాల్.

కొన్ని తరగతులు, వర్క్‌షాప్‌లు విద్యార్థులకు YAMP నిర్వహిస్తుందని చెప్పారు. యంగ్ ఆర్టిస్ట్‌లో అద్భుతమైన జ్యూరీ సభ్యులు ఉన్నారని 20 కేటగిరీల్లో విద్యార్థులకు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారని నిర్వాహకులు చెప్పారు. దేశంలో కనిపించని టాలెంట్ చాలామందిలో దాగి ఉందని, ఆ నైపుణ్యతను వెలికి తీయడంలో తను కూడా భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు యంగ్ ఆర్టిస్ట్ మెంటార్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం.

SIFF Young Artiste anounces 100 finalists for its scholarship programme,to be mentored by maestros

వివిధ కళలపై పట్టు సాధించేందుకు యంగ్ ఆర్టిస్ట్ అడ్వాన్స్‌డ్‌ మెంటార్షిప్ ప్రోగ్రాం ఒక గేమ్ ఛేంజర్‌గా వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న విద్యార్థులు ఒకే వేదిక ద్వారా తమ ఆలోచనలను పంచుకుంటారు. ఇక 100 మంది ఫైనలిస్టుల పూర్తి వివరాల కోసం యంగ్ఆర్టిస్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

యంగ్ ఆర్టిస్ట్ 2020 అనేది జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభా పాటవాలను గుర్తించడానికి ఏర్పాటు చేసిన సంస్థ. ఈ వేదిక ద్వారా విద్యార్థులకు ప్రేరణ కలిగించడం వారికి మంచి గుర్తింపును తీసుకురావడం జరుగుతుంది. యంగ్ ఆర్టిస్ట్ వీలైనంత మంది విద్యార్థులను గుర్తించి రూ.25 లక్షలతో 100 ఫైనలిస్టులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని భావిస్తోంది. కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో ఈ టాలెంట్‌ పోటీని నిర్వహిస్తోంది. విద్యార్థులకు జీవితకాలంలో ఒకసారి దక్కే సువర్ణ అవకాశం ఇది. అంతేకాదు దేశంలోని లెజెండరీ ఆర్టిస్ట్‌లు అయిన అంజద్ అలీ ఖాన్, టెరెన్స్ లూయిస్, షోవన్ నారాయణ్, శల్మలి ఖోల్గడే మరియు అరుణా సాయిరామ్‌ల నేతృత్వంలో వీరికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు మరింత రాణించేందుకు వీరి గైడెన్స్, మెంటార్షిప్, వీరికి కళలపై ఉన్న జ్ఞానం తప్పకుండా ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం:

Face Book: Young Artiste 2020

Instagram: Young Artiste 2020

Twitter: Young Artiste 2020

ఎస్ఐఎఫ్ఎఫ్‌ గురించి:

  వీళ్ల టాలెంట్ కి నా సెల్యూట్!!

  సింఘాల్ అయ్యర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్ఎఫ్) బెంగళూరుకు చెందిన దాతృత్వ సంస్థ, ఇది మెరుగైన విద్య కోసం కృషి చేయాలనే ఉద్దేశ్యంతో మరియు భారతీయ సంగీతం మరియు కళలపై మన ప్రేమను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది.

  వెబ్‌సైట్: http://siff.in/

  English summary
  SIFF Young Artiste 2020, a national level talent competition across various genres of music and dance, announced their Top 100 finalists.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X