• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో.. హస్తిన హోటళ్లో వర్ణవివక్ష.. తలపాగాతో లోపలికి వెళ్లనీయని వైనం... సోషల్ మీడియోలో పోస్ట్

|

న్యూఢిల్లీ : కొందరికి జాత్యాంహకార వేధింపులు తప్పడం లేదు. తమ వేషధారణ, తలపాగా ధరించడం పాపమైపోతుంది. విచిత్ర వేషధారణ, జుట్టు ఉన్న వారికి కులం, మతం పేరుతో దూషిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిక్కు యువకుడిని రెస్టారెంట్ యాజమాన్యం లోపలికి వెళ్లనీయలేదు. దీంతో అతని స్నేహితులు మేనేజ్‌మెంట్‌తో గొడవకు దిగారు. తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సదరు యువకుడు.

సీపీఎస్ రద్దు చేస్తాం .. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు పనిచేయాలన్న బొత్స

 అవమానం ..

అవమానం ..

ఢిల్లీకి చెందిన పరమ్ సాహిబ్ .. అతని స్నేహితులతో శనివారం రాత్రి కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. వీ కుతుబ్ రెస్టారెంట్ లోపలికి వెళ్లిన వారిని లాంజ్‌లోకి మాత్రం సిబ్బంది వెళ్లనీయలేదు. దీంతో అతని స్నేహితులు యాజమాన్యంతో గొడవకు దిగారు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తనకు జరిగిన అవమానాన్ని పోస్ట్ చేశారు. 'వీ కుతుబ్ హోటల్‌లో తమకు అవమానం జరిగిందని వివరించారు. స్నేహితులతో కలిసి వెళ్లిన తనను సిక్కు అనే ఏకైక కారణంతో అడ్డుకున్నారని వాపోయాడు. అంతేకాదు తమ హోటల్ లాంజ్‌లోకి సిక్కులకు ప్రవేశం లేదని దురుసుగా మాట్లాడరని పోస్ట్‌లో పేర్కొన్నాడు. హోటల్ సిబ్బంది మాత్రం అసభ్య పదజాలంతో దూషించి, క్లబ్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

దిగొచ్చిన యాజమాన్యం ..

దిగొచ్చిన యాజమాన్యం ..

పరమ్ సాహిబ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అతనిని కలిసేందుకు హోటల్ యాజమాన్యం దిగొచ్చింది. జరిగిన ఘటనపై మేనేజ్‌మెంట్ చింతిస్తోందని .. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరమ్‌ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని పరమ్ వెల్లడించారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తాము పోస్ట్ చేస్తే మిగతా ఘటనలు కూడా జరిగాయని కామెంట్లు పెడతారని భయపడుతుందని ఓ వార్తాసంస్తకు పరమ్ తెలిపారు. ప్రస్తుతం వీ కుతుబ్ హోటల్ యాజమాని దుబాయ్‌లో ఉన్నారు. ఈ ఘటనపై అతను స్వయంగా క్షమాపణ చెప్పడానికి మాత్రం వెనకడుగు వేశారని పరమ్ విమర్శించారు.

తప్పని క్షమాపణలు ..

తప్పని క్షమాపణలు ..

ఈ ఘటనపై క్షమాపణ చెప్పేవరకు ఉపేక్షించబోమని పరమ్ అంటున్నారు. తనకు జరిగిన అవమానంపై ఇప్పటికీ మాట్లాడుతున్నానని .. భవిష్యత్‌లో మరొకరికి అవమానం గురికాకుడదని పరమ్ అంటున్నారు. పరమ్ డిమాండ్‌తో ఎట్టకేలకు రెస్టారెంట్ యాజమాన్యం దిగొచ్చింది. 'వినియోగదారులను మేం గౌరవిస్తాం, కులం, మతం, ఇతర అంశాల గురించి పట్టించుకోం, యాజమాన్యం దృష్టిలో అందరూ సమానం, పరమ్‌కు జరిగిన అవమానానికి సంబంధించి క్షమాపణలు కోరుతున్నాం అని‘ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతోపాటు పరమ్‌తో అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు రెస్టారెంట్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sikh man from Delhi alleged he was denied entry to Delhi's We Qutub restaurant due to his religion and the attire he wore. Param Sahib -- a Sikh -- took to photo-messaging app Instagram and accused restaurant staff of misbehaving with him and his friend on Saturday night. He wrote in the Instagram post: HI wequtub, today later in the evening, I along with my friends was not allowed inside the premises on the grounds of being a Sardar and having an untrimmed beard, with a reason saying that I am not cool enough as per the other Hindu gentry."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more