వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస్థాన్‌లో ఓ సిక్కు యువతులను మత మార్పిడికి ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఇవాళ పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద సిక్కులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

పాకిస్థాన్‌లో ఉన్న సిక్కు కుటుంబాలకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పుల్వామా దాడి, జమ్ము కశ్మీర్ విభజన తర్వాత దాయాది దేశాల మధ్య ఉగ్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిక్కులు మత మార్పాడి చేయడాన్ని సిక్కులు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పాకిస్థాన్ హై కమిషనర్‌కు మెమోరాండం ఇచ్చేందుకు సిక్కు ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

Sikhs launch massive protest outside Pakistan embassy

సిక్కుల ఆందోళన నేపథ్యంలో పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా భద్రతా బలగాలను మొహరించారు. అయితే బారికేడ్లను తోసివేసి .. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సిక్కులు నినాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కు యువతులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. దీనిని భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది.

English summary
a group of members of the Sikh community launched a massive protest outside the Pakistan High Commission in New Delhi and were seen burning effigies to protest against the forced conversion of Sikh girls in Pakistan. The protesters are also demanding protection of the Sikh families residing in Pakistan amid heightened tensions between India and Pakistan. The Sikh community members were trying to submit a memorandum at the Pakistan High Commission when they were stopped. This irked the Sikhs who launched violent protests near the premises of the Pakistan embassy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X