వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారానికి ఐదురోజులే పనిదినాలు : సీఎం వరాలు, ఉద్యోగుల సంబరాలు

|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌టక్ : సిక్కిం కొత్త సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. వారానికి ఐదురోజులే సెలవు దినాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు రెండో శనివారం ఒక్కటే సెలవు దినం ఉండేది. తాజా ప్రకటనతో ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలిగింది. సిక్కిం ఆరో సీఎంగా పీఎస్ గోలే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

 అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

గ్యాంగ్‌టక్‌లోని పల్‌జోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గవర్నర్ గంగా ప్రసాద్ .. పీఎస్ గోలేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటిరకు సిక్కింలో ఎస్డీఎఫ్ నేత పవన్ చామ్లింగ్ సీఎంగా ఉన్నారు. ఆయన ఐదు పర్యాయలు .. 8 వేల 932 రోజులు పదవీలో ఉన్నారు. దేశ చరిత్రలో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సాధించారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులపై వరాలు కురిపించారు పీఎస్ గోలే. తనతోపాటు 11 మంది మంత్రులకు క్యాబినెట్‌లో చోటు కల్పించారు. ఐదురోజుల పనిదినాలని ప్రకటించారు. శనివారం ప్రభుత్వ కార్యక్రమాలు ఏమీ ఉండవని స్పస్టంచేశారు. మంత్రి కాదు స్వయంగా తను కూడా విలాసవంతమైన కార్లలో పయనించమని స్పష్టంచేశారు.

ఇవీ ప్రాధాన్యాలు

ఇవీ ప్రాధాన్యాలు

తమ ప్రభుత్వం ప్రథమ లక్ష్యం ఉపాధి కల్పన అని స్పష్టంచేశారు పీఎస్ గోలే. అలాగే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని భరోసానిచ్చారు. విద్యను ప్రాథమిక హక్కు చేసి అందరికీ అందిస్తామని తెలిపారు. భవనాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. అయితే గతంలో తను మిన్ టాంక్ గ్యాంగ్ ను క్యాన్సర్ రోగుల కోసం కేటాయిస్తామిన హామీనిచ్చారు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ అంశాన్ని లేవనెత్తలేదు. అంటే అధికార కార్యాలయంలోనే తాను ఉంటారని అర్థమవుతుంది.

ఎమ్మెల్యేగా గెలవాలి

ఎమ్మెల్యేగా గెలవాలి

సిక్కిం క్రాంతి మోర్చా అధ్యక్షుడు పీఎస్ గోలె ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నిక కావల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పోటీచేయలేదు. దీంతోపాటు నగదు అక్రమ తరలింపు కేసుపై అతను ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. 1994 నుంచి 1999 మధ్య ఈ కుంభకోణం జరిగింది. సిక్కిం అసెంబ్లీకి 32 సీట్లు ఉండగా .. ఎస్కేఎం 17 గెలువగా .. ఎస్డీఎఫ్ 15 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.

English summary
Prem Singh Tamang, popular as P S Golay, became the sixth chief minister of Sikkim when he was sworn in by governor Ganga Prasad at Gangtok’s Paljore stadium on Monday. It marked the end of the 25-year rule of the Sikkim Democratic Front (SDF) and its leader Pawan Chamling, who holds the record of the longest serving chief minister in any Indian state by administering Sikkim for 8,932 days. Immediately after being sworn in, the new chief minister declared a five-day week for the state government employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X