వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిబసు రికార్డు బ్రేక్:సుదీర్థకాలం సీఎం పదవిలో పవన్ చామ్లింగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌టక్: సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును పవన్ చామ్లింగ్ నెలకొల్పారు. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా 23 ఏళ్ళ నాలుగు నెలల 17 రోజుల నిరాంటక సర్వీసును ఆదివారంతో పూర్తి చేసుకొన్నారు.

68 ఏళ్ళ పవన్ చార్మింగ్ సిక్కింగ్ సీఎంగా తొలిసారి 1994 డిసెంబర్ 12న ప్రమాణం చేశారు. మెట్రిక్యులేషన్ వరకు చదవిన పవన్ 32 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో నార్ బహదూర్ భండారి క్యాబినెట్‌లో పలు హోదాల్లో మంత్రిగా పనిచేశారు.

 Sikkims Pawan Chamling pips Jyoti Basu as Indias longest-serving chief minister

రాజకీయంగా అనేక ఎగుడు దిగుళ్ళను చవిచూశారు. 1993 లో ఎస్‌డీఎఫ్‌ను స్థాపించారు. ఆయన స్థాపించిన పార్టీ సిక్కింలో అధికారంలోకి వచ్చింది. 1994 డిసెంబర్ 12న పవన్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండి ఆయన సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తాను విశ్రాంతి తీసుకోవాలని సిక్కిం ప్రజలు భావిస్తే సీఎం పదవి నుండి వైదొలుగుతానని పవన్ చామ్లింగ్ చెప్పారు.. తన సేవలు అవసరమని కోరుకొంటే తాను సీఎం పదవిలో కొనసాగుతానని ఆయన చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పాటు కొనసాగిన చరిత్ర జ్యోతిబసు పేరిట గతంలో ఉండేది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి జ్యోతి బసు ఐదు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

1977 జూన్ 21న తొలిసారిగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 నవంబర్ 6వ తేది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఐదవ టర్మ్‌ను జ్యోతిబసు పూర్తి కాలం సీఎం పదవిలో లేడు. ముఖ్యమంత్రి బాధ్యతలను జ్యోతిబసు బుద్ధదేబ్ భట్టాచార్యకు అప్పగించారు.

English summary
Sikkim chief minister Pawan Chamling created history on Saturday by becoming the longest-serving CM in India.He surpassed Jyoti Basu, 5-term Bengal CM from June 21, 1977 to November 6, 2000. Basu did not complete his fifth term for health reasons and handed over charge to Buddhadeb Bhattacharjee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X