వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రోజుల మౌనవ్రతం ...! ఫలితాల తర్వాత ఏమంటుందో: సాధ్వీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకున్న భోపాల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ,మాలేగావ్ పేలుళ్ల నిందితురాలైన సాధ్వీ ప్రగ్యా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు, అనగా మూడు రోజుల పాటు మౌన వ్రతం పాటిస్తానంటూ ట్విట్టర్లో పేర్కోంది. ఈనేపథ్యంలోనే గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటూ చేసిన వ్యాఖ్యలు ఎవరినైన ఇబ్బందులకు గురిచేస్తే క్షమించాల్సిందిగా మరోసారి కోరింది.

కాగా నటుడు కమలహాసన్ స్వతంత్ర్య భారత తొలి ఉగ్రవాదీ హిందువు అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సాధ్వీ ప్రాగ్యా మాట్లడుతూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమేపై పలు విపక్ష పార్టీలతో పాటు స్వంత పార్టీ నేతల నుండే విమర్శలు ఎదుర్కోంది. ఈనేపథ్యంలోనే ఆమే చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఆమేను ఆదేశించాడు. దీంతోపాటు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆమే వ్యాఖ్యలను తాను క్షమించనని అన్నారు. ఆమే చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరాలని ఆయన ఆదేశించారు.

 silence for three days till poll results :Sadhvi Pragya Singh

కాగా అంతకుముందు మాలేగావ్ పేలుళ్ల కేసును విచారించి, ముంబాయి బాంబు పెలుళ్లలో హతమయిన ఐపిఎస్ అధికారి హెమంత్ కర్కరే కూడ తన శాపం తగిలి మ‌ృతిచెందాడని ,తనను విచారణలో భాగంగా చిత్రహింసలకు గురిచేశాడని ఆమే వ్యాఖ్యనించడంతో అవివివాదస్పమయ్యాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో బాగంగా ఉన్నన్ని రోజులు ఆమే వివాదస్పద వ్యాఖ్యలకు వేదికగా నిలిచారు. ఇక ఎన్నికలు పూర్తయి కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్న వ్యాఖ్యల నేపథ్యంలోనే మరోసారి తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరతూ మూడు రోజుల పాటు మౌన తపస్పు చేస్తాననంటూ ట్విట్ చేసింది. మరి మూడు రోజుల మౌన వ్రతం తర్వాత ఇంకా ఎలాంటీ వివాదాలు స‌ృష్టిస్తుందో వేచి చూడాలి మరి.

English summary
BJP candidate from Bhopal Pragya Singh Thakur on Monday vowed to observe “three days of silence” till the Lok Sabha election results are declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X