వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టు పంచె, బంగారు వర్ణ కుర్తా, మెడలో పట్టు వస్త్రంతో మెరిసిపోతున్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాసేపట్లో భూమి పూజ జరగనుంది. అయోధ్య పుర వీధులు రామనామస్మరణతో మారుమోగిపోతోంది. జై శ్రీరాం అనే నినాదాలు నలు దిక్కులు పిక్కటెల్లేలా వినిపిస్తున్నాయి. మందిర భూమి పూజ కోసం ముఖ్య అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం అయోధ్యకు చేరుకుంటారు. మరోవైపు అయోధ్యకు ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేరుకొని.. భూమిపూజ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

.

Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామిAyodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి

అయోధ్యలో రామ మందిర నిర్మాణ మహోత్తర ఘట్టానికి శ్రీకారం చుడుతోన్న ప్రధాని మోడీ ప్రత్యేకంగా తయారయ్యారు. బంగారు వర్ణంలో గల పట్టు పంచె ధరించారు. పైన కుర్తా కూడా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. మెడలో కూడా పట్టు పంచె వేసుకొని సంప్రాదాయబద్దంగా కనిపించారు. భారతీయ సాంప్రదాయాలకు ప్రతీకగా తయారై.. అయోధ్యపురికి వెళ్లారు.

Recommended Video

Ayodhya Ram Mandir Bhoomi Pujan Update: రామమందిరం నిర్మాణం ఈ కాలపు మహాద్భుత ఘట్టం! | Oneindia Telugu
silk pancha, gold color kurta.. pm modi looks traditional..

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు.. అక్కడినుంచి హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకుంటారు. సాకేత్ కాలేజీ హెలిప్యాడ్‌లో మోడీ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రామాలయం భూమి పూజ స్థలానికి చేరుకుంటారు. భూమి పూజ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు. మోడీతోపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ గవర్నర్ ఆనిందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ వేదికను పంచుకోబోతున్నారు.

English summary
ayodhya bhoomi pujan: prime minister narendra modi weared silk pancha, gold color kurta for ayodhya bhoomi pujan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X