వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ మహాసభ నాయకుడి హత్య వెనుక రైల్వే ఉద్యోగి హస్తం: సిమి మాజీ కార్యకర్తగా: హుబ్బళ్లితో కనెక్షన్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ను కుదిపేసిన హిందూ మహాసభ నాయకుడు కమలేష్ తివారి హత్యోదంతం అనూహ్య మలుపు తిరిగింది. కమలేష్ తివారి హత్య మూలాలు కర్ణాటకలో కనిపించాయి. కమలేష్ తివారి హత్యకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తోన్న మహమ్మద్ జఫర్ సాదిక్ కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. హుబ్బళ్లిలోని రైల్వే వర్క్ షాప్ లో అతను పని చేస్తున్నాడని సమాచారం. కమలేష్ తివారి హత్యోదంతంపై దర్యాప్తు కొనసాగిస్తోన్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు..హుబ్బళ్లికి వచ్చి సాదిక్ ను అదుపులోకి తీసుకున్నారనే వార్త గుప్పు మంటోంది.

యుద్ధం మొదలైంది: కమలేష్ హత్యకు మేమే బాధ్యులమంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్యుద్ధం మొదలైంది: కమలేష్ హత్యకు మేమే బాధ్యులమంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్

హిందూ మహాసభ నాయకుడు, హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేష్ తివారిని లక్నోలోని ఆయన కార్యాలయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. గొంతు కోసి, కత్తులతో పొడిచి దారుణంగా పట్టపగలే ఆయనను హతమార్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ కల్లోలానికి కారణమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయంటూ ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా కొనసాగుతోన్న హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని ప్రభుత్వం కాపాడుకోలేపోయిందని ధ్వజమెత్తుతున్నారు.

SIMI associate detained in Karnataka in connection with Kamlesh Tiwari murder

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కమలేష్ తివారి హత్యోదంతంపై దర్యాప్తు ముమ్మరం చేసింది. హంతకుల ఆచూకీని తెలిపిన వారికి రెండున్నర లక్షల రూపాయల బహుమానాన్ని కూడా ప్రకటించింది. హత్యకు పాల్పడటానికి ముందు ఆ ఇద్దరు లక్నోలోని ఓ హోటల్ బస చేసినట్లు గుర్తించారు. హోటల్ లో తనిఖీ చేయగా.. రక్తపు మరకలు అంటిన కాషాయ దుస్తులు లభించాయి. ఇదే కేసులో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. కమలేష్ తివారి హత్య కేసు మూలాలు కర్ణాటకలో ఉన్నట్లు వెల్లడైందని తెలుస్తోంది.

హుబ్బళ్లిలోని రైల్వే వర్క్ షాప్ లో జాఫర్ సాదిక్ పని చేస్తున్నాడని తేలింది. దీనితో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు హుబ్బళ్లికి వెళ్లి.. సాదిక్ ను అరెస్టు చేశారని అంటున్నారు. నిషేధానికి గురైన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో అతను క్రియాశీలకంగా వ్యవహరించే వాడని తెలుస్తోంది. ఇస్లామిక్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి గుట్టు చప్పుడు కాకుండా స్థానికంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టే వాడని, ఓ వర్గానికి చెందిన యువకులకు ఆకర్షితులను చేసేలా ఉపన్యాసాలు ఇచ్చే వాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాదిక్ నేపథ్యాన్ని ఆరా తీస్తున్నారు.

English summary
A person has been detained by the Internal Security Division in connection with the Kamlesh Tiwari murder case. Sources say that the person detained has been identified as Mohammad Zafar Sadiq and was picked up from Hubbali in Karnataka. He was formerly associated with the Students Islamic Movement of India and was working at a workshop in the railway department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X