వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిమి ఉగ్రవాదం: అంతా వ్యూహాత్మకం, డబ్బులెక్కడ ఉంటాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్, నల్గొండ జిల్లాల్లో సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) ఎన్‌కౌంటర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. సిమి ఉగ్రవాదులు పౌరులను బెదిరించి దోపీడీలకు గురి చేయడం, పోలీసులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

ఈ ఘటన సంచలనం సృష్టించింది. శనివారం నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఇద్దరు సిమి ఉగ్రవాదులను, మంగళవారం నాడు జనగామ - ఆలేరు మధ్యలో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు ఎదురు కాల్పుల్లో హతమార్చారు. వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రం ఎన్‌కౌంటర్లతో వణుకుతోంది.

జానకీపురం వద్ద కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు గతంలో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుండి తప్పించుకొని వచ్చిన వారు. వారు అక్టోబర్ 2013న తప్పించుకొని వచ్చారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాదులో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వ్యూహాత్మకంగా విడిపోయారు

ఈ నేపథ్యంలో సిమి ఉగ్రవాదులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయనే చర్చ కూడా సాగుతోంది. సిమి 2004లో విడిపోయింది. అంటే విభేదాలతో కాదు.. భారత్‌లో సిమిని బ్యాన్ చేశారు. దీంతో వారు వ్యూహాత్మకంగా విడిపోయారు.

అందులో ఓ వర్గం న్యాయస్థానాల చుట్టు సిమి కార్యకలాపాల కోసం తిరుగుతోంది. సఫ్దర్ నాగోరి నేతృత్వంలో మరో వర్గం రాడికల్ కార్యకలాపాలు చేసేందుకు వచ్చింది. సిమి వైపు చాలామందిని ఆకర్షించడంలో నాగోరి విజయవంతమయ్యాడని అంటారు.

కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, బీహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వహించారు. దీంతో సిమి కార్యకర్తల బలం 500 వరకు చేరుకుంది. అయితే, 2008లో నాగోరి పట్టుబడ్డ తర్వాత సిమి కార్యకలాపాలు కొంత తగ్గాయి.

దీంతో, ఇందులోని కొందరు ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపించారు. దేశంలోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ముజాహిదీన్ ఆరేళ్లుగా పని చేస్తోంది. అయితే, దీనిని స్థాపించిన యాసిన్ భత్కల్, మరో ముగ్గురి అరెస్టు తర్వాత దీని కార్యకలాపాలు కూడా కొంత తగ్గాయి.

ఈ నేపథ్యంలో సిమి మరోసారి రెచ్చిపోయింది. హైదర్ అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ సిమి బాధ్యతలు తీసుకున్నాడు. అతని నేతృత్వంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ పాట్నాలో, బోద్ గయాలో బాంబులు పేల్చారు.

SIMI: Where has the outfit parked its funds?

హైదర్ అలీ అరెస్ట్

హైదర్ అలీని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అతని అరెస్టుతో మరోసారి సిమి కార్యకలాపాలు తగ్గాయి. అదే సమయంలో ఖాండ్వా జైలు నుండి ఐదుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. 2013 అక్టోబర్ నెలలో తప్పించుకున్నారు.

అప్పటి నుండి పలు రాష్ట్రాలలో బస్సులలో తిరుగుతున్నారు. హైదరాబాదులో చాలారోజులు తిష్ట వేశారు. అనంతరం సూర్యాపేటలో కాల్పులు, ఇద్దరు పోలీసుల హతం, జానకీపురంలో ఎన్ కౌంటర్, తప్పించుకున్న ఇద్దరు ఉగ్రవాదుల్లో ఇద్దరు మృతి, తాజాగా వికారుద్దీన్ సహా ఐదుగురు మృతి చెందారు.

డబ్పులు ఎక్కడి నుండి వస్తున్నాయి?

సిమి రెచ్చిపోతున్న నేపథ్యంలో వారికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయనే ప్రశ్న అందరిలోను సహజంగా ఉదయిస్తుంది. సిమి ఆపరేషన్స్ కోసం వచ్చే డబ్బులు.. హవాలా ద్వారా వస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి ఉగ్రవాదులు కేరళ రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.

తమకు వచ్చిన డబ్బులను సిమి ఎవరి వద్ద పెడుతుందో.. ఆ సంస్థ టాప్ లీడర్లకే తెలుసునని తెలుస్తోంది. వారు తమ డబ్బును క్రిమినల్స్, చిన్న చిన్న రాజకీయవేత్తల వద్ద ఉంచుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ వివరాలు టాప్ లీడర్స్‌కు తప్ప ఎవరికీ తెలియదని తెలుస్తోంది.

పలు రూపాల్లో డబ్బులు సేకరణ

సిమి ఉగ్రవాదులు వివిధ రూపాల్లో డబ్బులు సంపాదించుకుంటారు. పౌరులను బెదిరించి డబ్బులు రాబరీ చేయడం అందులో ఒక మార్గం. పెద్ద పెద్ద సంస్థల్లో దొంగతనాలు చేయడం మరో మార్గం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, మధ్యప్రదేశ్‌లో వారు పెద్ద ఎత్తున డబ్బులు దొంగిలించారు.

ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వారు దాదాపు తొంబై లక్షల రూపాయలను రాబరీ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని వారు ఎక్కడ ఉంచారనే విషయమై విచారణ సంస్థలు దర్యాఫ్తు చేస్తున్నాయి. వీరు స్లీపర్ సెల్స్ మద్దతు లేకుండా డబ్బులు దాచిపెట్టలేరని అంటున్నారు.

English summary
Even as the hunt for the remainder of the SIMI men intensifies, investigations would show that the revival of the deadly outfit was part of a major plan. Two operatives were gunned down in Nalgonda last week in an encounter after they had shot at a constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X