చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజిన్‌లో పొగ‌: విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

|
Google Oneindia TeluguNews

చెన్నై: సింగ‌పూర్ విమానానికి తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. పైలెట్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల 170 ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు. సింగ‌పూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్ వేస్ సంస్థ‌కు చెందిన విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

170 మంది ప్ర‌యాణికుల‌తో స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం నంబ‌ర్ ఎస్‌సీఓ 567 త‌మిళ‌నాడులోని తిరుచ్చి నుంచి సింగ‌పూర్‌కు బ‌య‌లుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేప‌టికే విమానం ఇంజిన్‌లో అవాంఛ‌నీయ శ‌బ్దాలు వినిపించాయి. కొద్దిసేప‌టికే పొగ వెలువ‌డింది. ప్ర‌మాదాన్ని శంకించిన పైలెట్ వెంట‌నే సమీపంలోని చెన్నై విమానాశ్ర‌యం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్ర‌దించారు.

Singapore-bound flight makes emergency landing at Chennai airport after spark in engine

ఏటీసీ అనుమ‌తి ఇవ్వ‌డంతో విమానాన్ని చెన్నైలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు. ఇంజిన్ నుంచి పొగ రావ‌డానికి గ‌ల కార‌ణాలను ఇంజినీర్లు ప‌రిశీలిస్తున్నారు. విమానం సాయంత్రం 5 గంటల స‌మ‌యంలో సింగ‌పూర్‌కు బ‌య‌లుదేరి వెళ్తుంద‌ని విమానాశ్ర‌య అధికారులు తెలిపారు.

Singapore-bound flight makes emergency landing at Chennai airport after spark in engine
English summary
During the early hours of Monday, Flyscoot pilots recieved a smoke warning from the automated trigger system in the plane's cargo. Flight SCO 567 carrying 170 passengers had its scheduled departure from Trichy Airport in Tamil Nadu at 1.30 am on Monday, and was on its way to Singapore. The flight was expected to land at 8.30 am in Singapore. However, just a few hours into its journey, pilots recieved the trigger warning. Immediately they checked for grounding in Chennai International Airport, following which the aircraft landed in the airport’s cargo area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X