వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసహనంపై అద్నాన్, తెలుగులోనూ పాటలు పాడారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌లో అసహనం ఏమాత్రం లేదని, అసహనం ఉండి ఉంటే తాను ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకొని ఉండేవాడిని కాదని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ చెప్పారు. రెండు రోజుల క్రితం అద్నాన్ సమీకి భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది.

భారత్‌లో తాను ఎప్పుడూ అసహనాన్ని ఎదుర్కోలేదని చెప్పారు. తనకు పౌరసత్వాన్ని మంజూరు చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు రుణపడి ఉంటానని ట్విట్టర్‌లో పేర్కొన్నరు. అతను జై హింద్ అని కూడా ట్వీట్ చేశారు. భారత్ పౌరుడిని అవుతున్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.

కాగా, తన గాత్రంతో లక్షలాది ప్రేక్షకులను అలరించిన అద్నాన్ సమీ పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదులుకొని భారతీయ పౌరసత్వాన్ని అందుకునున్నారు. గతంలో ఈయన తెలుగులో పాడిన 'ఏ జిల్లా ఏ జిల్లా' పాట సంగీత ప్రియులను అలరించింది.

Singer Adnan Sami, Newly Indian, Tweets 'Jai Hind' With Tricolour

వర్షం, మహానంది, యోగి, ఆడువారి మాటలకు అర్దాలే వేరులే, శంకర్ దాదా జిందాబాద్, 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు.

హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ లాంటి ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన అద్నాన్ సమీ జనవరి 1, 2016 నుండి భారత పౌరుడిగా మారారు. పాకిస్తాన్‌కు చెందిన అద్నాన్ సమీ 2001 నుండి భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇతను 1975 ఆగస్టు 15న జన్మించారు.

English summary
Singer Adnan Sami, Newly Indian, Tweets 'Jai Hind' With Tricolour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X