వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాట పాడలేదని మహిళా సింగర్‌ను తుపాకీతో కాల్చేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని ఓ గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చౌబీస్ పరగణ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పియూ అనే ఆర్కెస్ట్రా గాయకురాలు ఉన్నారు.

ఆమె బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చారు. అయితే, అభిమానులు కోరిన పాటను పాడటానికి నిరాకరించింది.

Singer in UP Shot Dead for Refusing to Perform Song

దీంతో ఆగ్రహించిన బబ్లూ కుమార్ సింగ్ అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఆమెను తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పియూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర శివారులోని బాటసింగారం వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

English summary
A 23-year-old orchestra singer was today shot dead by a man after she allegedly refused to perform a song on the demand of the audience during a marriage function in Baria area here, a senior police officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X