వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sapna: స్వప్నా పై చీటింగ్ కేసు పెట్టిన పవన్, అగ్రిమెంట్ తో ముంచేసింది, డ్యాన్స్ లేదు తొక్కా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబాయి/ బెంగళూరు: కుర్రకారుకు కిక్కెక్కించే మంచి డ్యాన్స్ స్టేజ్ షోల్లో పాల్గొంటానని నమ్మించి తమను మోసం చేసి నిలువునా ముంచేసిందని పీ అండ్ ఎం మూవీస్ డైరెక్టర్ పవన్ చావ్లా అనే బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ ఫేమస్ డ్యాన్సర్, హర్యాన్వి సింగర్ మీద రూ. 4 కోట్ల చీటింగ్ కేసు నమోదైయ్యింది. బిగ్ బాస ఫేమ్ స్వప్నా చౌధరి తదితరుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో స్వప్నా చౌధరి చిక్కుల్లో పడింది.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

స్వప్నా చౌధరితో డీల్

స్వప్నా చౌధరితో డీల్

2018లో ఓ స్టేజ్ షో నిర్వహించడానికి పీ అండ్ ఎం మూవీస్ ప్రై.లి. చీఫ్ పవన్ చావ్లా నుంచి రూ. 1 కోటి అడ్వాన్స్ తీసుకున్న స్వప్నా చౌధరి తరువాత చేతులు ఎత్తేశారని ఆరోపణలు ఉన్నాయి. స్టేజ్ షోతో పాటు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తామని నమ్మించిన బిగ్ బాస్ షో ఫేమ్ స్వప్నా చౌధరి తరువాత మోసం చేసిందని పవన్ చావ్లా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ. కోటి తీసుకుని ఫ్లాట్ తీసుకుంది

రూ. కోటి తీసుకుని ఫ్లాట్ తీసుకుంది


స్టేజ్ షో, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తామని మమ్మల్ని నమ్మించిన స్వప్నా చౌధరి రూ. 4 కోట్లుకు డీల్ మాట్లాడుకున్నదని, తరువాత రూ. 1 కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బుతో గుర్ గావ్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిందని పవన్ చావ్లా ఆరోపించారు. అగ్రిమెంట్ ప్రకారం స్వప్నా చౌధరి తరువాత స్టేజ్ షో నిర్వహించలేదని పంకజ్ చావ్లా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ తో ఫేమస్

బిగ్ బాస్ తో ఫేమస్


స్వప్నా చౌధరీ బిగ్ బాస్ సీజన్ 11తో పాపులర్ అయ్యారు. ఓ స్నేహితుడి ద్వారా తాను స్వప్నా చౌధరిని కలిశానని, తరువాత మా పీ అండ్ ఎం మూవీస్ సంస్థతో పని చెయ్యడానికి ఆమె అగ్రిమెంట్ చేసుకున్నారని పీ అండ్ ఎం మూవీస్ చీఫ్ పవన్ చావ్లా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

రూ. 3. 50 కోట్లు ఇప్పించండి

రూ. 3. 50 కోట్లు ఇప్పించండి

ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మా దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న స్వప్నా చౌధరి మమ్మల్ని మోసం చేసి నిలువునా ముంచేసిందని, మాకు రావలసిన రూ. 3. 50 కోట్లు వసూలు చేసి ఇప్పించాలని పవన్ చావ్లా ఢిల్లీ పోలీసులకు మనవి చేశారు. స్వప్నా చౌధరి, ఆమె తల్లికి మేము 2018లో రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ. 50 లక్షలకు చెక్కులు ఇచ్చామని పవన్ చావ్లా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని మేము అడిగితే స్వప్నా చౌధరి తదితరులు మమ్మల్ని బెదరిస్తున్నారని పవన్ చావ్లా ఆరోపిస్తున్నారు.

 అగ్రిమెంట్ లో ఏముందంటే ?

అగ్రిమెంట్ లో ఏముందంటే ?

2018లో పీ అండ్ ఎం మూవీస్ సంస్థతో స్వప్నా చౌధరి అగ్రిమెంట్ లు చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం స్వప్నా చౌధరి పీ అండ్ ఎం మూవీస్ సంస్థ అనుమతి లేకుండా ఎక్కడ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ లు, స్టేజ్ షోలు ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే మా అగ్రిమెంట్ ను తుంగలో తొక్కి, మా దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని స్వప్నా చౌధరి మోసం చేసిందని పవన్ చావ్లా ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. స్వప్నా చౌధరి తదితరుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

English summary
Sapna: The Delhi Police's Economic Offences Wing has registered an FIR against Haryanvi singer Sapna Choudhary and others on charges of alleged misappropriation of funds, cheating and criminal conspiracy, officials said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X