వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధే మాపై సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ముంబై: అధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ పై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న వారి మీద బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ మండిపడుతున్నారు. రాధే మా ఎలాంటి దుస్తులు వేసుకుంటే మీకెందుకని ప్రశ్నించారు.

సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్ సైట్ లో చేసిన వ్యాఖ్యలు దూమరం రేపి మరింత వివాదాన్ని సృష్టిస్తున్నాయి. రాధే మా కురచ దస్తులు ధరించారంటూ రాద్దాతం చేస్తున్నారు, అదే కాళికాదేవి అంతకన్న కురచదస్తుల్లో కనిపిస్తారు కదా ఆ సంగతేమిటి అని సోనూ నిగమ్ ప్రశ్నించారు.

అసలు బట్టలే వేసుకోకుండా నగ్నంగా సంచరిస్తు అసభ్యంగా నృత్యం చేసే సాధువుల సంగతి ఏమిటని ఆదివారం సోనూ నిగమ్ ట్విట్టర్ లో ప్రశ్నించి కొత్త వివాదానికి తెర తీశారు. అంతే కాకుండ పలు ట్విట్ లు చేశారు.

Singer Sonu Nigam supporting controversial godwoman Radhe Maa

కుంనమేళా లాంటి కార్యక్రమాలకు కొన్ని తెగలకు చెందిన సాధువులు నగ్నంగా సంచరించినా, అసభ్యంగా నృత్యం చేసినా పట్టించుకోరని, వాటిని కళ్లు మిలకరించి మరి చూస్తారని అన్నారు. అత్యాచారం ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు స్పందిస్తారని అన్నారు.

ఆడవాళ్లకో న్యాయం, మగవాళ్లకో న్యాయమా అంటు రాధే మా మీద విమర్శలు చేస్తున్న వారిని సూటిగా ప్రశ్నించారు. రాధే మా మీద కేసులు వెయ్యడం న్యాయం కాదని, ఆమె మీద అరోపణలు చేస్తున్న వారిని, ఆమెను దేవతగా కొలుస్తున్న భక్తుల మీద ఈ సమాజం కేసులు పెట్టాలని మరో ట్విట్ చేశారు.

అధ్యాత్మిక కార్యక్రమాలలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాధే మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాధి పాల్లుని బ్రహ్మభట్ కేసు వేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ముసుగులో కురచ దుస్తులు వేసుకుని భక్తులను కౌగిలింతలు, ముద్దులతో ముంచెత్తుతూ దేవతలను కించపరుస్తున్నారని పలు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ ఈనెల 5వ తేదిన మిని స్కర్ట్ లు వేసుకున్న రాధే మా ఫోటోలు మీడియాకు విడుదల చేసి సంచలనం సృష్టించారు. కురచ దస్తులు ఇంట్లో వేసుకుంటే ఎవ్వరికి అభ్యంతరం లేదని రాధే మా మీడియా ముందు సమర్థించుకున్నారు.

English summary
Singer Sonu Nigam joined the line of film personalities supporting controversial godwoman Radhe Maa by putting out a series of tweets on Sunday suggesting that obscenity charges against her smacked of gender bias.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X