వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసిపాప గుండె ఆపరేషన్ కోసం కన్నతల్లి ఒంటరి పోరాటం: మీ సాయం కావాలి

Google Oneindia TeluguNews

ఆమె పేరు అంకిత. ఆమెకు వివాహం అయినప్పటి నుంచి అన్నీ కష్టాలే. అత్తమామలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు ఆడపిల్ల పుట్టినందుకు ఇంట్లో నుంచి వెలివేశారు. ఇక పుట్టిన పాపాయికి గుండె శస్త్రచికిత్సకి అవసరమైన సహాయం చేస్తారనుకోవడం పొరపాటు. నిస్సహాయతతో గొంతు నుంచి మాట కూడా పెగలని పరిస్థితికి లోనైంది అంకిత. అలా అని తన కుటుంబం పరువును బజారు పాలు చేసే మనిషి కాదు అంకిత.

నెలలు కూడా సరిగ్గా నిండని అనారోగ్యంతో పోరాడుతున్న బిడ్డతో రోజుల తరబడి ఆసుపత్రిలో ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంది. నిత్య నరకప్రాయంగా జీవనం సాగిస్తోంది.

అంకిత గృహ హింస భాదితురాలు కూడా. పెళ్ళైన మొదటి రోజు నుంచే నరకానికి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉండేది ఆమె జీవితం.

నిరంతర కష్టాలు ఆమె దైనందిక జీవనంలో సాధారణం అయినప్పటికీ, ఎప్పటికైనా తన జీవితంలో వెలుగురాకపోతుందా అనే ఆశతోనే జీవితం గడుపుతోంది.

 Single Mother Fights Against Society To Save Her Baby Girl

రోజూ ఏదో మంచి జరుగుతుందనే ఆశతో ఆమె జీవన పయనం మొదలువుతుంది. ఏదో ఒకరోజు తన కష్టాలు పూర్తిగా తీరుతాయని ఆమె ఆశ. తాను గర్భిణిగా ఉన్నప్పుడు బిడ్డ పుట్టాక తన కష్టాలు తీరుతాయని భావించింది అంకిత. కానీ ప్రసవం అయిన తర్వాత ఆమె మరింత క్లిష్టమైన పరిస్థితులకు ఎదుర్కోవాల్సి వచ్చింది.

"నా భర్త, ఆయన కుటుంబసభ్యులు నేను గర్భం దాల్చాలని తెలుసుకుని చాలా సంతోషించారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు. " అంటూ అంకిత తన గతాన్ని వివరించింది.

ఆమె 5 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో, ఒక రొటీన్ స్కాన్ ద్వారా గర్భంలోని శిశువుకు జన్మతహా గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లుగా ధృవీకరించారు. ఆ సమయంలో ఆమె భర్త, అతని కుటుంబం సభ్యులు కూడా మద్దతునిచ్చారు. గర్భంలోని శిశువు అబ్బాయి అనుకుని అంకితను కొన్నాళ్లు బాగా చూసుకున్నారు. అంకిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిపాప పేరు అపరాజిత. అపరాజిత పుట్టిన తరువాత అంకిత అత్తగారింటి వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అమ్మాయి పుట్టడంతో అంకితపై వారంతా కోపం పెంచుకున్నారు. అందుకు తోడు అపరాజిత అనారోగ్యంతో జన్మించింది. ప్రాణాంతకమైన గుండె సమస్యతో విలవిలలాడిపోతుంది అపరాజిత. ఆ పసిపాపకు ఖరీదైన గుండె చికిత్స అవసరమైంది.

 Single Mother Fights Against Society To Save Her Baby Girl

"ఇప్పుడు నేను, నా కూతురు అష్టపకష్టాలుపడుతున్నాం. ఆడపిల్ల అని కాకుండా, పసిబిడ్డలా భావించి కుటుంబంలో ఉండనివ్వమని కోరినందుకు బిడ్డతో సహా నన్ను ఇంటి నుంచి గెంటేసారు. వారి ప్రకారం, నేను క్షమించరాని నేరం చేశాను. ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఇంట్లో నుంచి గెంటేశారు. నేను ఇప్పుడు ఒంటరినైనా సరే, నా బిడ్డను బతికించుకోవాలనుకుంటున్నాను. అందరూ వదిలేస్తే, ఆ పసి ప్రాణం ఏమైపోవాలి. నా పాపకు జీవితాన్ని ప్రసాదించాలని ఒక తల్లిగా నేను పోరాడాలనుకుంటున్నాను. గెలుస్తానో లేదో తెలీదు కానీ, ప్రయత్న లోపం మాత్రం చేయను." అంటూ ఏడ్చింది అంకిత.

అంకిత తల్లిదండ్రులు కొంతమేర ఆమెకు అండగా నిలబడ్డారు. శిశువును కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. ఐసీయూ లో తన పసిపాప ఎన్నిరోజులు గడిపింది అనేది అంకితకే గుర్తులేదు. తన శిశువు వైద్య ఖర్చులు పూర్తిగా తనే భరించింది ఇప్పటివరకు. ఆమె తల్లిదండ్రులు వృద్దాప్యంలో ఉన్నారు. అయినా కూతుర్ని దూరం చేసుకోకుండా తమతో ఉండేలా చూసుకుంటున్నారని తెలిపింది. కనీసం వారిని డబ్బు అడగాలన్నా, వారి పరిస్థితి తెలిసి కూడా వారిని అడగడం భావ్యం కాదని అర్ధం చేసుకున్నానని తెలిపింది.

ఇంతలో, అపరాజిత పరిస్థితి మరింత తీవ్రమైంది. శ్వాస కూడా కష్టతరమై వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటువంటి ఆదరవూ లేక, తన నిస్సహాయతకు ఏడవడం తప్ప పరిష్కారం కనపడలేదు. ఆమె ఆహారం తీసుకోవడానికి బాగా ఇబ్బందిపడేది. గుండె కవాటాల సమస్యలను సైతం ఎదుర్కొనేది. ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే బిడ్డ ప్రాణాలను నిలబెడుతుందని వైద్యులు చెప్పారు.

 Single Mother Fights Against Society To Save Her Baby Girl

"శస్త్రచికిత్సకు మరో రూ. 3.5 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక తల్లిగా, నా బిడ్డ, జీవితాన్ని కాపాడుకోగలిగితే, నేను ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పోరాటానికి అర్ధం ఉందని నేను భావిస్తాను. నన్ను ఆదుకోవడానికి, నాకంటూ ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితాన్ని నేను ఊహించలేను. ఆసుపత్రి కారిడార్లో ఎన్నోసార్లు బోరున విలపిస్తుంటే, ఎంతోమంది మీలాంటి విధేయులైనవారు నాకు సమయం కేటాయించి, నన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. మీ చేతుల్లో అపరాజిత విధిని ఉంచాను. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నాకు సహాయం చేయరా " అంటూ అంకిత కన్నీళ్ళ పర్యంతమైంది.

మానవత్వం ఉనికిని చాటే ప్రయత్నంలో మనమున్నామని అందరూ చేతులు కలుపుదాం. మీ నుంచి ఏ చిన్న సహకారమైనా ఆ పసిపాప అపరాజిత ప్రాణాన్ని నిలపగలదు. అంకిత తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమెకు సహాయం చెయ్యండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X