బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దండుపాళ్యం తరహాలో: మహిళపై కిరాతకం: పట్టపగలు..బెడ్‌రూమ్‌లో..గొంతుకోసి..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తోన్న ఓ మహిళ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ మహిళను అత్యంత పాశవికంగా గొంతుకోసి హత్య చేశారు. అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన బెంగళూరులో కలకలాన్ని రేపింది. మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది. దండుపాళ్యం ముఠా కిరాతకాన్ని గుర్తుకు తెచ్చినట్టయింది.

BJP: టీడీపీ అడుగు జాడల్లో: కర్నూలు డిక్లరేషన్ ఏమైంది కన్నా? బీజేపీకి సీమ, ఉత్తరాంధ్ర సెగ..!BJP: టీడీపీ అడుగు జాడల్లో: కర్నూలు డిక్లరేషన్ ఏమైంది కన్నా? బీజేపీకి సీమ, ఉత్తరాంధ్ర సెగ..!

మృతురాలి పేరు మంజుల. వయస్సు 40 సంవత్సరాలు. ఆరు నెలలుగా ఆమె గాయత్రి నగరలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్నారు. తన కుమారుడితో కలిసి గాయత్రి నగరకు నివాసాన్ని మార్చినప్పటి నుంచీ ఆమె చీటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తితో గొంతు కోసం దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో పడేశారు.

 Single women found dead in Gayatri Nagara in Bengaluru, Police suspect murder

ఇంట్లో ఉన్న కొన్ని విలువైన వస్తువులను చోరీ చేశారు. సుమారు రెండు గంటల తరువాత పొరుగింట్లో నివసిస్తోన్న వారు మంజుల ఇంటికి వెళ్లగా.. ఈ హత్యోదంతం వెలుగు చూసింది. బెడ్‌రూమ్‌లో రక్తపు మడగులో పడి ఉన్న మంజుల మృతదేహాన్ని చూసిన వెంటనే వారు ఆమె కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్య నగర పోలీస్‌స్టేషన్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఎంఎస్ రామయ్మ ఆసుపత్రికి తరలించారు.

 Single women found dead in Gayatri Nagara in Bengaluru, Police suspect murder

ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్త చేస్తున్నామని సుబ్రహ్మణ్య నగర ఎస్ఐ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు. మంజుల కుమారుడి ద్వారా పూర్తి విషయాలను సేకరించారు. చీటీ నిర్వహిస్తున్న కారణంగా- దానికి సంబంధించిన వివదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలోనూ విచారణ చేపడతామని తెలిపారు. మంజులను హత్యోదంతం తెలిసిన వారి పనే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

English summary
Manjula had been separated from her husband for the past five years and was living with her son. Though she was not employed, she was said to be in a private chit fund business without a valid licence. The murder is suspected to be linked to the chitfund business without a valid licence. The murder is suspected to be linked to the chit fund business, though the police are yet to reach any conclusion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X