వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూసారు. మదర్ థెరిస్సా మరణాంతరం చారిటీస్ బాధ్యతలను 1997లో స్వీకరించిన ఆమె, సంస్ధ కార్యకలాపాలను మరింతగా విస్తరించారు.

Sister Nirmala, Mother Teresa's successor, dies at 81

1997 -2009 వరకు మిషనరీ ఆఫ్ చారిటీస్ నిర్వహకురాలిగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు.

నేపాల్ నుంచి భారత్‌కు వచ్చిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన సిస్టర్ నిర్మల జులై 23, 1934న రాంచీలో జన్మించారు. 17 సంవత్సరాల వయసులోనే ఆమె ఆర్డర్‌లో చేరారు.

సిస్టర్ నిర్మల మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

మదర్ థెరిస్సా వారసురాలిగా మిషనరీస్ ఆప్ ఛారిటీ బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా పేదల కోసం, అనాథల కోసం సేవలందించిన సిస్టర్ నిర్మలను కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.

సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపాన్ని తెలిపారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహకురాలు నిర్మల మృతికి నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె నిస్వార్థపూరితమైన సేవా దృక్పథం యావత్ ప్రపంచానికే ఆదర్శనీయమైనవన్నారు.

English summary
Sister Nirmala Joshi, the former superior general of the Missionaries of Charity, passes away at 81. Sister Nirmala had replaced Mother Teresa as the superior general in 1997.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X