• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sisters: పెళ్లి కొడుక్కి డబుల్ ఢమాకా, ఒకేసారి అక్కాచెల్లితో ?, పంచి ఊడిపోయింది, అయినా వదల్లేదు !

|

బెంగళూరు/కేజీఎఫ్/చెన్నై: అక్కాచెల్లిని ఒకేసారి పెళ్లి చేసుకున్న యువకుడు పంచి చేతిలో పట్టుకుని తప్పించుకునిపారిపోనా పోలీసులు మాత్రం వదల్లేదు, ఇప్పుడు పెళ్లి కొడుకు కటకటాలపాలైనాడు. కరోనా సెకండ్ వేవ్ లో డబుల్ ఢమాకా అంటూ అక్కాచెల్లిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్న వరుడితో పాటు అందరికి చిక్కులు మొదైనాయి. పెళ్లి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు, ఒకేసారి ఇంటికి ఇద్దరు కొడళ్లను తెచ్చుకున్న అత్తామామలు, పెళ్లి చేసిన పంతులు, పెళ్లి పత్రికలు ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఇప్పుడు ఎక్కడ మా పంచెలు ఊడిపోతాయో అంటూ మాయం అయిపోయారు. ఇదే సమయంలో ఉచిత సలహాలు ఇచ్చిన ఊరిపెద్దలు కూడా ఎక్కడ మా మీద కేసులు పెడుతారో అంటూ హడలిపోతున్నారు. ఇంత స్టోరీ జరగడానికి కారణం అయిన పెళ్లి కూతురు మాత్రం ఆ ఏమీ కాదులే అంటుండటంతో ఆ ఊరి ప్రజలు ముక్కున వేలువేసుకుంటున్నారు.

Illegal affair: అన్నా అనింది, యాపిల్ పండు చిక్కిందని ?, భార్య, భర్త, ప్రియుడు ఏం చేశారంటే !Illegal affair: అన్నా అనింది, యాపిల్ పండు చిక్కిందని ?, భార్య, భర్త, ప్రియుడు ఏం చేశారంటే !

చెల్లితో పెళ్లి ఫిక్స్

చెల్లితో పెళ్లి ఫిక్స్

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లా ముళబాగిలు తాలుకా చిన్నబాగేపల్లిలో నివాసం ఉంటున్న చిక్క చెన్నరాయప్ప, దోడ్డ లక్ష్మమ్మ కుమారుడు ఉమాపతి, మళబాగిలు తాలుకా వేగమడుగు గ్రామానికి చెందిన నాగరాజప్ప, రాణెమ్మల కుమార్తె లలితాకు పెళ్లి చెయ్యాలని నిశ్చయించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో పెళ్లి సింపుల్ గా ఊరిలోని గుడిలో చెయ్యాలని పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నిర్ణయించారు.

పెళ్లి కూతురు సోదరి ఎంట్రీ

పెళ్లి కూతురు సోదరి ఎంట్రీ

మే 7వ తేదీన ఉమాపతి, లలిత పెళ్లి జరిపించాలని డేట్ ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో పెళ్లి కుమార్తె లలిత ఓ డిమాండ్ తెరమీదకు తెచ్చింది. పెళ్లి కూతురు లలితకు సుప్రియా అనే సోదరి ఉంది. పుట్టుకతోనే సుప్రియా మూగ, చెవుడు. ఇంతకు ముందు ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినా సుప్రియాకు మాత్రం ఇంత వరకు పెళ్లి జరగలేదు.

ఊరి పెద్దల ఉచిత సలహా

ఊరి పెద్దల ఉచిత సలహా

తనకు పెళ్లి జరిగిపోతే తన సోదరి సుప్రియాను ఎవ్వరూ పెళ్లి చేసుకోరని లలిత ఆలోచించింది. తనతో పాటు తన సోదరిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అప్పుడు నేను అక్క సుప్రియా నీతో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుందని పెళ్లి కూతురు లలిత పెళ్లి కొడుకు ఉమాపతికి చెప్పింది. ఇదే విషయం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఊరిపెద్దలు కూడా అక్కా చెల్లిని ఒక్కరే పెళ్లి చేసుకుంటే ఎవ్వరికి సమస్యలు ఉండవని ఉచిత సలహా ఇచ్చేశారు.

 పెళ్లి కొడుక్కి డబుల్ ఢమాకా

పెళ్లి కొడుక్కి డబుల్ ఢమాకా


నా సోదరి సుప్రియాను పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని లలిత పెళ్లి కొడుకు ఉమాపతికి తేల్చి చెప్పింది. సరలే ఒకరిని చేసుకుంటే ఒకరు ఫ్రీ అంటూ ఉమాపతి ఊ అన్నాడు. మే 7వ తేదీన అక్కాచెల్లికి పెళ్లి అంటూ పెళ్లి పత్రికలు ముద్రించి అందరికి పంచిపెట్టారు. కోవిడ్ నియమాలు పాటించి ఊర్లోనేని చెన్నరాయస్వామి ఆలయంలో ఉమాపతి, లలిత, సుప్రియాల మెడలో తాళికట్టాడు.

 పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు వైరల్

పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు వైరల్


కరోనా కాలంలో కూడా నీకు భలే చాన్స్ చిక్కింది ఉమాపతి అంటూ కొందరు అతని పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియో, పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతే ఆ ఫోటోలు ఇక్కడా అక్కడా చక్కర్లు కొట్టి జిల్లాధికారి డాక్టర్ సెల్వమణి కంట్లోపడ్డాయి. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసిన మహానుభావులు అక్కడ ఓ లిటికేషన్ పోస్టు చెయ్యడంతో కథ అడ్డం తిరిగింది.

పెళ్లి కూతురికి 16 ఏళ్ల వయసు

పెళ్లి కూతురికి 16 ఏళ్ల వయసు

అక్కాచెల్లిని పెళ్లి చేసుకున్న ఉమాపతి మీద కక్ష కట్టుకున్నారో ఏమోకాని చెల్లికి ఇంకా 18 ఏళ్ల నిండలేదని, ఆమె మైనర్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైలర్ అయ్యింది. జిల్లా కలెక్టర్ సెల్వమణి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. పెళ్లి చేసుకున్న రెండో అమ్మాయి మైనర్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పెళ్లి పంతులు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని మాయం

పెళ్లి పంతులు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని మాయం

వారం రోజుల పాటు అక్కాచెల్లితో ఎంజాయ్ చేసిన పెళ్లి కొడుకు ఉమాపతి మాయం అయ్యాడు. పోలీసులు పెళ్లి కొడుకు ఉమాపతితో పాటు అతని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తెల తల్లిదండ్రులు, పెళ్లి జరిగిన చెన్నరాయస్వామి దేవాలయం పూజారి మీద, పెళ్లి పత్రికులు ప్రింట్ చేసిన ముళబాగిల్ గాయిత్రీ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని మీద కేసులు నమోదు చేశారు. మైనర్ ను పెళ్లి చేసుకోవడం నేరం అని పెళ్లి కొడుకు మీద కేసు నమోదు చెయ్యడంతో అతను పంచి చేతిలో పట్టుకుని పరారైనాడు.

పెళ్లి కొడుకు అరెస్టు

పెళ్లి కొడుకు అరెస్టు

మైనర్ ను పెళ్లి చేసుకుని ఆమెను శారీరంగా వేధించారని ఆరోపిస్తూ పెళ్లి కొడుకు ఉమాపతిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద 7 మంది మీద కేసులు నమోదు కావడంతో అక్కాచెల్లిని పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చిన ఊరిపెద్దలు ఇప్పుడు ఎక్కడ తమ మీద కేసులు నమోదు చేస్తారో ? అనే భయంతో హడలిపోతున్నారు.

English summary
Sisters: Kolar district Mulbagal taluk Nangali police arrested Umapathi who married Supriya and Lalitha on May 7th 2021. Case filed against Umapathi under child marriage act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X