వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య : కారణమొక్కటే.. బలవంతంగా..!

|
Google Oneindia TeluguNews

కేరళ : కేరళలో ఇద్దరు అక్కా చెల్లెళ్ల అనుమానస్పద మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన అక్కా చెల్లెళ్లు ఇద్దరూ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. పలకడ్ పట్టణంలోని ఒలవకొడె ప్రాంతంలో ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనుప్రియ(19), నిమా(20) అనే ఇద్దరు తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు కాకపోయిన చిన్నప్పటి నుంచి సొంత అక్కా చెల్లెళ్ల కంటే ఎక్కువగా పెరిగారు. ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం.

suiscide

కాగా, ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం ఉదయం బయటకి వెళ్లి వచ్చిన మృతుల అమ్మమ్మ, అనుప్రియ-నిమా ఉన్న గది తలుపు తెరిచి చూడగా ఇద్దరు విగత జీవులుగా ఉరేసుకుని కనిపించారు.

ఇదిలా ఉంటే ఆత్మహత్యకు పాల్పడిన గదిలో సూసైడ్ లెటర్ దొరకడంతో, అక్కా చెల్లెళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియవచ్చాయి. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో ప్రస్తావించారు అక్కా చెల్లెళ్లు. అయితే ఆత్మహత్యకు ప్రధాన కారణం తమకు ఇష్టం లేని పెళ్లిళ్లను కుటుంబ సభ్యులు బలవంతంగా జరిపించాలని చూడడమే అని పేర్కొన్నారు.

అక్కా చెళ్లెలిద్దరిలో నిమాకు వివాహం కాగా ఉద్యోగ నిమిత్తం ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఇదే క్రమంలో మలప్పురం జిల్లాలోని కదలుండిలో ఉండే అనుప్రియ చెల్లెలు నిమా దగ్గరకు వచ్చింది. అనుప్రియకు కూడా పెళ్లి నిశ్చయం కావడం, తనకు ఆ పెళ్లి ఇష్టం లేని విషయాన్ని నిమాతో చెప్పడం జరిగిపోయాయి.

అప్పటికే నిమాకు ఇష్టం లేని జరిగి ఉండడం, అనుప్రియకు కూడా ఇష్టంలేని పెళ్లి చేయాలని చూడడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు జంటగా ఆత్మహత్యగా పాల్పడ్డారు. అయితే అక్కాచెల్లెళ్లిద్దరు గతంలో వేరే వ్యక్తులను ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఇష్టపడ్డ వ్యక్తులతో కాకుండా బలవంతపు వివాహాలే వీరిద్దరి ప్రాణం తీశాయంటున్నారు అక్కడి స్థానికులు.

English summary
Its a incident happened in kerala that two sisters are suicided for parents forcing for arranged marriages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X