వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1984 నాటి కేసు: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌కు కొత్త చిక్కులు

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. 1984లో చెలరేగిన సిక్కు అల్లర్లతో ఆయనకు సంబంధం ఉందంటూ నమోదైన కేసును సిట్ పునర్ విచారణ చేపట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా అనుమతిచ్చింది.

 1984 నాటి కేసు: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌కు కొత్త చిక్కులు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం తర్వాత 1984లో ఢిల్లీలోని రికబ్ గంజ్ గురుద్వారా బయట జరిగిన అల్లర్లలో కమల్ నాథ్ పాల్గొన్నారని శిరోమణి అకాళిదళ్ నేత మంజీందర్ ఎస్ సిర్సా ఆరోపించారు. అంతేగాక, ఈ మేరకు సాక్ష్యం చెప్పేందుకు ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు. వారిద్దరూ సిట్ ఎప్పుడు పిలిచినా వచ్చి వాంగ్మూలం ఇస్తారని చెప్పారు.

సిట్ అధికారులతో మాట్లాడామని, వారు ఏదో ఒక తేదీని చెబుతామని చెప్పారని తెలిపారు. కీలకంగా ఉన్న ఆ ఇద్దరు సాక్షులకు తగిన భద్రత కల్పించాలని సిర్సా కోరారు. సిక్కులకు న్యాయం జరగాలంటే కమల్ నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా విజ్ఞప్తి చేశారు.

English summary
A Special Investigation Team (SIT), set up by the Union home ministry, has decided to reopen seven anti-Sikh riot cases, where the accused were either acquitted or the trial closed, according to an official notificatio
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X