వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సీతా' ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఆమె అలానే పుట్టింది: మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం బీజేపీ నేతలకు అలవాటైంది. తాజాగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ 'సీత' జననంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అని, ఇందుకు రామాయణంలోనూ ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

'సీత ఒక కుండ లాంటి పెద్ద పాత్రలో జన్మించింది. ఓరోజు జనక మహారాజు పొలం దున్నుతుండగా ఆయనకు ఆ పాత్ర కనిపించింది. ఆ తర్వాత ఆ చిన్నారే సీతాదేవి అయింది' అని శర్మ చెప్పారు. దీన్నిబట్టి ఆరోజుల్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఉందని అన్నారు. శర్మ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురువారం రాత్రి ఓ సభలో ప్రసంగించిన సమయంలో శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడుతున్నాయి. శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ బీహార్, నేపాల్ లలో ఆయన దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు. 'శర్మ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. పార్టీ తరుపున మేం వాటిని ఖండిస్తున్నాం' అని ఓ బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.

Sita was a test tube baby says UP deputy CM

సీతాదేవిపై వ్యాఖ్యల కంటే ముందు మరో వివాదాస్పద కామెంట్ కూడా చేశారు శర్మ. గూగుల్ పురాణాల్లోనూ ఉందని చెప్పుకొచ్చారు. 'మీ గూగుల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ మా గూగుల్ అంతకుముందు నుంచే ఉంది. నారదముని అప్పట్లో ఓ గూగుల్. ఆయనో జర్నలిస్టు. ఎక్కడినుంచి ఎక్కడికైనా సందేశాన్ని పంపించగలరు' అని వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవలే బీజేపీ త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్లు ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ ఎమ్మెల్యే జ్ఞానదేవ్.. హనుమంతుడు ప్రపంచంలోనే తొలి ఆదివాసీ నాయకుడు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పాఠ్య పుస్తకంలో తప్పిదం:

గుజరాత్ 12వ తరగతి పాఠ్య పుస్తకంలో ఓ తప్పు దొర్లింది. కాళిదాసు రచించిన 'రఘువంశం'లోని ఓ ఘట్టంలో 'సీతను రాముడు ఎత్తుకుపోయిన ఆ ఘటనను లక్ష్మణుడు రాముడికి వర్ణించి చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది' అని ప్రచురించారు. రావణుడికి బదులు రాముడు అన్న పదం రావడంతో ఇది కూడా వివాదాస్పదమైంది. ఇంగ్లీషు అనువాదంలో ఈ తప్పు దొర్లినట్టు తెలుస్తోంది.

English summary
UP deputy CM Dinesh Sharma said on Thursday evening that Sita’s birth in the “Ramayana” was evidence of a “test-tube baby project”. In less than 24 hours, the top BJP leadership asked him to exercise restraint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X