prakash karat sitaram yechury mallu swarajyam cpm hyderabad congress cpim raghavulu ప్రకాశ్ కారత్ సీపీఎం హైదరాబాద్ మల్లు స్వరాజ్యం రాఘవులు
సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభించిన మల్లు స్వరాజ్యం, బీజేపీపై ఏచూరీ నిప్పులు
హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభలు ఆర్టీసీ కళ్యాణ మండపంలో బుధవారం ప్రారంభమయ్యాయి. మల్లు స్వరాజ్యం జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. అనంతరం సరూర్ నగర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. మహాసభల ప్రారంభం సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రసంగించారు.

కథువా వంటి సంఘటనలు విషాదకరం అన్నారు. చిన్నారులపై అత్యాచారాలు జరగడం బాధాకరం అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరీ బీజేపీ, ఆరెస్సెస్‌ల పైన నిప్పులు చెరిగారు. యువత అధికంగా ఉన్న భారత దేశంలో ఏడాదికి ఏడాది నిరుద్యోగాలు పెరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న యువతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లేవన్నారు.
అనంతరం రాఘవులు మాట్లాడారు. మోడీ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం ఏపీ, తెలంగాణలో పోరాటం చేస్తామన్నారు.