వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్ల కేసు: ఛార్జ్‌షీట్‌లో ఏచూరి, యోగేంద్ర యాదవ్, జయతీ ఘోష్‌ పేర్లు లేవన్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో హింసకు దారితీసిన కేసులకు సంబంధించి దాఖలైన చార్జిషీట్లలో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌, ఆర్థిక వేత్త జయతీ ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ అపూర్వానంద్‌ల పేర్లు ఉన్నట్టు మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు.

ఢిల్లీ అల్లర్ల కేసుల ఛార్జ్‌షీట్‌లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటన చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో నిరసనకారుల్ని రెచ్చగొట్టారనే ఆరోపణలపై సదరు నేతలపై కేసులు నమోదయ్యాయని, అల్లర్ల కేసులో అరెస్టయిన ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ 'పీటీఐ' వెల్లడించడం గందరగోళానికి దారి తీసింది.

నన్ను రేప్ చేయడానికి బీజేపీ అనుమతించాలా?: సంజయ్ రౌత్‌పై కంగనా రనౌత్ ఫైర్ : గవర్నర్‌తో భేటీనన్ను రేప్ చేయడానికి బీజేపీ అనుమతించాలా?: సంజయ్ రౌత్‌పై కంగనా రనౌత్ ఫైర్ : గవర్నర్‌తో భేటీ

Sitaram Yechury, Yogendra Yadav, Jayati Ghosh not charged in Delhi riots: Police

'పీటీఐ' కథనాలపై స్పందించిన ఏచూరి.. కేంద్రం, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే ఢిల్లీ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ట్వీట్ చేశారు. హింసకు దారితీసేలా విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. తన ప్రసంగాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటిని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థంకావడంలేదని అన్నారు. చివరికి ఈ నేతల పేర్లు కేసుల్లో లేవని ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu

వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా నిరసనలు జరగడం తెలిసిందే. ఆ క్రమంలో ఈశాన్య ఢిల్లీలో మతకలహాలు చెలరేగాయి. ఫిబ్రవరి 23 నుంచి 29 వరకు జరిగిన అల్లర్లలో మొత్తం 56 మంది హత్యకు గురయ్యారు. అందులో 36 మంది ముస్లింలుకాగా, 15 మంది హిందువులున్నారు. మరో ఇద్దరు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదు. గొడవల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. హింసకు సంబంధించి వందలాది ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2200 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
The Delhi Police on Sunday denied media reports that a supplementary charge sheet was filed in the Delhi riots case against some activists, including CPI(M) general secretary Sitaram Yechury, Swaraj campaign leader Yogendra Yadav and economist and Delhi University professor. Jayanti Ghosh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X