వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టరీ డెత్ : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు మృతి..ఏం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

మల్లాపురం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు తొమ్మిదేళ్లల్లో మృతి చెందిన ఘటన కేరళలో వెలుగుచూసింది. మల్లాపురంకు చెందిన దంపతులకు పుట్టిన ఆరుగురు పిల్లలు మృతి చెందండం అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మూడు నెలల చిన్నారి మృతి చెందడంతో పోలీసులు కేసును నమోదు చేశారు.

మూడు నెలల చిన్నారి మృతి

మూడు నెలల చిన్నారి మృతి

మల్లాపురంలో నివసిస్తున్న తారామ్మల్ రఫీక్ మరియు షబ్నా దంపతులకు పుట్టిన మూడు నెలల చిన్నారి మృతి చెందడంతో మృతదేహాన్ని మంగళవారం ఉదయం పూడ్చారు. అంతకుముందు ఈ దంపతులకు చెందిన ఐదుగురు పిల్లలు మృతి చెందడం ఆ తర్వాత మూడు నెలల చిన్నారి మృతి చెందడంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం తిరూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పిల్లలు వరుసగా మృతి చెందుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మిగతా పిల్లల మృతిపై ఆరా తీస్తున్న పోలీసులు

మిగతా పిల్లల మృతిపై ఆరా తీస్తున్న పోలీసులు


రఫీక్ షబ్మా దంపతులకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉండగా మూడో అమ్మాయి నాలుగేళ్ల వయసు వరకు ప్రాణాలతో ఉన్నిందని ఆ తర్వాత మృతి చెందగా మిగతా వారంతా ఒక ఏడాదిలోపే మృతి చెందారని ఎస్పీ చెప్పారు. బుధవారం పోస్టుమార్టం పూర్తయ్యింది. ఇక మిగతా పిల్లలు ఎలా మృతి చెందారనేదానిపై మెడికల్ రికార్డ్స్‌ను సేకరిస్తున్నట్లు చెప్పారు ఎస్పీ అబ్దుల్ కరీం. ఈ పిల్లలు ఎలా మృతి చెందారనేదానిపై మెడికల్ రికార్డులు పరిశీలించి ఆపై ఫారెన్సిక్ డాక్టర్లతో చర్చించి చెబుతామని చెప్పారు తిరూర్ డీఎస్పీ సురేష్ బాబు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు తామేమీ చెప్పలేమని అన్నారు డీఎస్పీ సురేష్. అది అసహజ మరణాలని ఇప్పుడే చెప్పలేమన్న డీఎస్పీ ఇప్పటి వరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. రఫీక్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.

 అంతా ఒక ఏడాదిలోపే మృతి

అంతా ఒక ఏడాదిలోపే మృతి


తొలి బిడ్డ ఆరు నెలలు ఉన్నప్పుడు మృతి చెందగా... రెండో బిడ్డ పుట్టిన 55 రోజులకే మృతి చెందింది.మూడో చిన్నారి పుట్టిన 25 రోజులకు మృతి చెందింది. మూడో బిడ్డ మృతి చెందినప్పుడు పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా వైద్యులను కోరగా ఆ బిడ్డ ఎపిలెప్టిక్ అటాక్‌తో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఇక ఈసారి షబ్నా గర్భవతిగా ఉన్నప్పుడే అన్ని పరీక్షలు నిర్వహించారు. కొన్ని టెస్టులకు సంబంధించిన శాంపిల్స్ హైదరాబాదుకు పంపారు. అన్ని టెస్టులు నార్మల్‌గానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. మంగళవారం వరకు చనిపోయిన బిడ్డ బాగానే ఉన్నాడని రఫీక్ సోదరి నూర్జహాన్ చెప్పింది. పోలీసుల విచారణకు సహకరిస్తున్నట్లు నూర్జహాన్ చెప్పింది.

English summary
The death of six children of a couple in a span of nine years in a family in Malappuram has raised suspicion. A police case has been registered following a complaint after a three-month-old child of the family died on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X