వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెహ్లాట్ సర్కార్‌కు కొత్త టెన్షన్... ఢిల్లీలో వసుంధర రాజే... వ్యూహాలకు పదును పెడుతున్నారా...?

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి,సీనియర్ బీజేపీ నేత వసుంధర రాజే శనివారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన మరుసటిరోజే రాజ్‌నాథ్‌తో ఆమె భేటీ అయ్యారు. గత కొన్నాళ్లుగా రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మౌనం వహిస్తూ... పార్టీతోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న రాజే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవడం హాట్ టాపిక్‌గా మారింది.

రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి ఆమె రాజ్‌నాథ్,నడ్డాలతో చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అగస్టు 14 నుంచి రాజస్తాన్‌ అసెంబ్లీ ప్రారంభం కానుండటం,ఈ సమావేశాల్లో గెహ్లాట్ ప్రభుత్వ బలం తేలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో... రాజే ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి రాజస్తాన్‌లో పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ వసుంధర రాజే మౌనం వహిస్తూ వచ్చారు.

Six days before Rajasthan showdown, Vasundhara Raje meets Rajnath Singh

ఇటీవలి పార్టీ సమావేశాల్లోనూ ఆమె ఎక్కడా కనిపించలేదు. సచిన్ పైలట్‌ను బీజేపీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ... ఆమె ఎక్కడా కలగజేసుకోలేదు.
దీంతో అశోక్ గెహ్లాట్ సర్కార్ కూలిపోకుండా ఉండేందుకు ఆమె పరోక్షంగా సహాయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలకు ఆమె స్వయంగా ఎక్కడా బదులివ్వనప్పటికీ... తాను పార్టీకి విధేయురాలినని,పార్టీ భావజాలానికి కట్టుబడి ఉంటానని ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వసుంధర రాజే పార్టీ పెద్దలతో ఏం మంతనాలు జరుపుతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే కొద్దిరోజుల్లో రాజస్తాన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె వాళ్లతో చర్చిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే నామ మాత్రపు మెజారిటీతో ఉన్న అశోక్ గెహ్లాట్ సర్కారుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై వచ్చే తీర్పు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవచ్చు.

అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తూ వస్తున్న బీజేపీ.. అందివచ్చే ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చూస్తోంది. ఈ క్రమంలో రాజస్తాన్ రాజకీయాల్లో రాబోయే వారం రోజుల్లో మరెన్ని నాటకీయ పరిణామాలు,మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇప్పటికైతే వసుంధర రాజే ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ శిబిరంలో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది.

English summary
Senior BJP leader and former Rajasthan chief minister Vasundhara Raje met defence minister Rajnath Singh amid the political crisis in the state triggered by the rebellion of Congress leader and former deputy chief minister of the state,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X