• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి - Newsreel

By BBC News తెలుగు
|

ఎదురు కాల్పులు

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుఘామున ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. మృతుల్లో మహిళ కూడా ఉన్నారని వెల్లడించింది.

గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని విశాఖ ఎస్పీ కార్యాలయం తెలిపింది.

"మావోయిస్టులు ఉన్నార‌న్న సమాచారంతో మంప పీఎస్ ప‌రిధిలో కూంబింగ్ చేప‌ట్టారు. తెల్ల‌వారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంది. ఘ‌ట‌నాస్థ‌లికి అద‌న‌పు బ‌ల‌గాలు వస్తున్నాయి" అని కొయ్యూరు పీఎస్ సీఐ వెంకట రమణ చెప్పారు.

కాల్పులు జ‌రిగిన ప్రాంతంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, తపాంచ, మూడు 303 రైఫిల్స్ లభ్యమయ్యాయని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ పార్లమెంటులో తిట్టుకుని, పుస్తకాలతో కొట్టుకున్న ఎంపీలు

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మంగళవారం అధికార, విపక్షాల మధ్య బూతులు తిట్టుకోవడంతో మొదలైన గొడవ, పుస్తకాలతో కొట్టుకోవడం వరకూ వెళ్లింది.

మంగళవారం నేషనల్ అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో విపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడ్డానికి ప్రయత్నించారు.

ఆ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గొడవ మొదలైంది.

పాకిస్తాన్ పార్లమెంటులో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతోంది.

ఆ వీడియోలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన అధికార పార్టీ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్‌ ఎంపీ అల్వీ అవాన్ విపక్ష ఎంపీలను తిడుతూ కనిపిస్తున్నారు. ఎంపీలు ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకోవడం కూడా ఇందులో కనిపిస్తోంది. బడ్జెట్ పుస్తకాలతో సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది.

పార్లమెంటులో గొడవ పెద్దదవడంతో నేషనల్ అసెంబ్లీ సెక్రటరీ అదనపు బలగాలను పిలిపించారు. కానీ అదనపు బలగాలు వచ్చిన తర్వాత కూడా సభలో పరిస్థితి అదుపులోకి రాలేదు.

అధికార, విపక్షాలు పార్లమెంట్ హాల్లో ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూనే ఉండిపోయారు.

విపక్ష నేత షాబాజ్ షరీఫ్ పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ మొత్తం గొడవ గురించి ట్వీట్ చేశారు.

https://twitter.com/CMShehbaz/status/1404800985814417412

"అధికార పార్టీ ఎలా గూండాయిజం చెలాయిస్తోందో ఈరోజు టీవీలో దేశమంతా చూస్తోంది. నీచమైన తిట్లు కూడా తిట్టారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ నైతికంగా ఎంత దిగజారిందో, పీటీఐ నియంతృత్వ ధోరణులున్న పార్టీగా మారిందనేది ఇది చూపిస్తోంది" అన్నారు.

ఇదంతా జరగడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణం అని ముస్లిం లీగ్-నవాజ్ ఎంపీ మరియం ఔరంగజేబ్ ఆరోపించారు.

https://twitter.com/Marriyum_A/status/1404803146963116036

"ఇమ్రాన్ ఖాన్ సృష్టించిన నూతన పాకిస్తాన్‌లోని పరిస్థితి ఇది. ఆయన నియంతృత్వ ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది. పార్లమెంటును స్తంభింపజేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి ఇమ్రాన్ ఖాన్ దేన్నీ వదలడం లేదు. విపక్షాలపై పుస్తకాలు విసిరారు" అని ట్వీట్ చేశారు.

అయితే అధికార పార్టీ ఎంపీలు మాత్రం దీనికంతా విపక్ష ఎంపీలే కారణమని ఆరోపించారు.

https://twitter.com/AliAwanPTI/status/1404812983948169217

"నేను తిడుతున్న వీడియో వైరల్ అయినప్పటికీ, అంతకు ముందు నుంచే విపక్షాలు హద్దు మీరాయి. పీఎంఎల్-ఎన్ ఎంపీలు మొదట మమ్మల్ని తిట్టారు, ఆ తర్వాత మేం కూడా వారిని తిట్టాం" అని పీటీఐ ఎంపీ ఆవాన్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Six Maoists killed in crossfire in Visakhapatnam district - Newsreel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X