వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్ధిక్ పటేల్ ఎఫెక్ట్: ఆరుగురు పటీదార్లకు మంత్రివర్గంలో చోటు కల్పించిన విజయ్ రూపానీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమ ప్రభావం కన్పించింది. ప్రధాన రాజకీయ పార్టీలు పటీదార్లకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతను ఇచ్చాయి. పటీదార్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. విజయ్ రూపానీ మరోసారి ముఖ్యమంత్రిగా మంగళవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో ఆరుగురు పటీదార్లకు రూపానీ చోటు కల్పించారు.

విజయ్‌రూపానీతో పాటు మరో 20 మంది మంత్రులు మంగళవారం నాడు ప్రమాణం చేశారు.వీరిలో 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ. తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్‌ పటేల్‌, సౌరభ్‌ పటేల్‌, ప్రభాత్‌ పటేల్‌, ఈశ్వర్‌ పటేల్‌, రచ్చండ భాయ్‌ పటేల్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్‌ దేవ్‌ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్‌ కావడం గమనార్హం.

Six Patidars, one woman in Gujarat council of ministers

ఇక విజయ్‌ రూపానీ కేబినెట్‌లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్‌ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి.

English summary
The 20 ministers who took oath in the newly formed council of ministers in Gujarat today, include six Patidar leaders, and only one woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X