వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలో డ్యామ్‌కు గండీ...6గురు మృతి...18 మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టికి రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్ లీకేజీలతో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత పడగా మరో 18 మంది గల్లంతయ్యారు. గత 20 సంవత్సరాలుగా డ్యామ్‌కు ఎలాంటీ మరమ్మతులు చేయకపోవడంతో గండి పడడంతోపాటు , కుంభ వృష్టి వర్షాలకు డ్యామ్ సైతం పోంగిపోర్లింది..దీంతో పలు వాహానాలు సైతం వరదలో కొట్టుపోయాయి.

రత్నగిరిలో డ్యాం గండీ,

రత్నగిరిలో డ్యాం గండీ,

మహారాష్ట్ర కురుస్తున్న కుంభవృష్టికి పాతకాలపు డ్యాములు లీకేజీలు అవుతున్నాయి...దీంతో గత రాత్రీ రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్‌ లీకేజీ అయింది..ఈ నేపథ్యంలోనే డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 18 ఇళ్లు నేలమట్టమట్టాయ్యాయి. ఈనేపథ్యంలోనే గత రాత్రీ పది గంటల సమయంలో వచ్చిన వరదల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారని మరో పందేనిమిది మంది సైతం గల్లంతైనట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రకటించాయి..మరోవైపు డ్యాం పరివాహక ప్రాంతంలో ఉన్న ఏడు గ్రామాలు జలమయ్యాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహయక చర్యలు చేపట్టాయి.

6గురు మృతి, 18 మంది గల్లంతు

6గురు మృతి, 18 మంది గల్లంతు

ఇక వరదల్లో మృత్యువాత పడిన ఆరుగురిని డ్రోన్ కేమేరాల ద్వార గుర్తించామని ,అయితే గల్లంతయిన 18 మంది జాడ తెలియరాలేదని ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి అలోక్ అవాస్థీ తెలిపారు.కాగా వరదల్లో చిక్కుకున్న వారికి సహయం అందించేందుకు అటు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం పాల్గోన్నాయి.

ముంచెత్తుతున్న వర్షాలు...

ముంచెత్తుతున్న వర్షాలు...

కాగా ముంబాయి నగరంలో ఇంకా వర్షాలు కొనసాగుతుండగా నిన్న ఒక్కరోజే నగరంలో 300 నుండి 400 మి.మీ వర్షం పడిందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు.కాగా తానే,ఫాల్గడ్, రాయ్‌ఘడ్ జిల్లాలతోపాటు రత్నగిరి ,నాసిక్, సిందూర్గ్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు.కాగా 14 సంవత్సరాల తర్వాత కుంభవృష్టి వర్షాలు కురుస్తుండడంతో ముంబయి నగరంలో జనజీవనం స్థంభించిన విషయం తెలిసిందే...

English summary
Six people were killed and 18 are still missing after heavy rainfall led to a breach in the Tiware Dam in Maharashtra's Ratnagiri district at around 9.30 pm last night. Seven down-stream villages have been flooded and at least 12 houses and 20 vehicles near the dam have been washed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X