వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ ఫ్యామిలీకి వార్నింగ్: ఎంపీ అయినా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్, చివరికి !

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను బెదిరించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు మంది రౌడీలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తప్పించుకుని పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు గ

|
Google Oneindia TeluguNews

కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను బెదిరించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు మంది రౌడీలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తప్పించుకుని పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు గాలిస్తున్నారు.

కోల్ కతాలోని శరత్ బోస్ రోడ్డులోని నేతాజీ కుటుంబ సభ్యులు డాక్టర్ సిశిర్ బోస్ నివాసంలో సోమవారం నిందితులు నానా హంగామా చేశారని కేసు నమోదు చేశారు. తృణమల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుగత బోస్ ఫిర్యాదు మేరకు బాల్యగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Six persons arrested for threatening Trinamool Congress MP Sugata Bose

భారీ వర్షాల కారణంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసం దెబ్బ తినింది. ఇంటి మరమత్తులు చెయ్యడానికి కార్మికులు వచ్చారు. సోమవారం ఇంటి మరమత్తులు జరుగుతున్న సందర్బంలో ఇంటిలో ఎంపీ సుగత బోస్, డాక్టర్ సిశిర్ బోస్, కృష్ణ బోస్ తదితరులు ఉన్నారు.

ఆ సందర్బంలో నాలుగు బైక్ ల్లో ఎనిమిది మంది రౌడీలు అక్కడికి వెళ్లారు. మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఇంటి మరమత్తులకు అవసరమైన సామాగ్రి ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? మా దగ్గరే మీరు ఇటుకలు, ఇసుక, సిమెంట్ కొనుగోలు చెయ్యాలని బెదిరించారు.

మాకు డబ్బులు (మామూళ్లు) ఇస్తేనే ఇంటి మరమత్తుల చెయ్యాలని, లేదంటే మీ అంతు చూస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జాదవ్ పూర్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ సుగత బోస్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆరు మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన ఆరు మంది రౌడీలు సిండికేట్ రాజా గ్యాంగ్ సభ్యులు అని పోలీసులు తెలిపారు.

English summary
Trinamool Congress MP Sugata Bose on Monday alleged that some people threatened and demanded money from him for carrying out renovation at his family residence here after which six persons were arrested by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X