వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హిమాచల్‌లో కమలం పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. గుజరాత్‌లోని క్లియర్ మెజార్టీ వచ్చినప్పటికీ సీట్లు, ఓట్ల శాతం తగ్గాయి. దీంతో ప్రధాని మోడీ తన తీరును మార్చుకోవాలని విపక్షాలు మాటల దాడి చేస్తున్నాయి.

కానీ బీజేపీకి తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు రావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే, బీజేపీ గెలుపుకు కొన్ని అంశాలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఆరేడు విషయాలు బీజేపీ గెలుపును నిర్దేశించాయి.

బీజేపీతో ఢీ, మోడీకి గుజరాత్ చేదు: రాహుల్ గాంధీ వెనుక నటి రమ్యబీజేపీతో ఢీ, మోడీకి గుజరాత్ చేదు: రాహుల్ గాంధీ వెనుక నటి రమ్య

బీజేపీని పలు అంశాలు దెబ్బతీశాయి

బీజేపీని పలు అంశాలు దెబ్బతీశాయి

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. అదే సమయంలో ఆశించిన విజయం సాధించకపోవడం నిరుత్సాహమే. నూటా యాభై సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పగా, వంద సీట్లకు పైగా మాత్రమే గెలిచారు. బీజేపీని పలు అంశాలు దెబ్బతీశాయి.

జీఎస్టీ ప్రభావం,

జీఎస్టీ ప్రభావం,

గుజరాత్‌లో వ్యాపారులు ఎక్కువ. జీఎస్టీ ప్రభావం ఎన్నికలపై పడింది. జీఎస్టీ విషయంలో వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిలో కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తదితర కారణాలతో చాలామంది కమలం వైపు మొగ్గు చూపారు. అలాగే, మణిశంకర్ అయ్యర్ చివరి నిమిషంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. అదే సమయంలో ప్రధాని మోడీ చేసిన 'పాకిస్తాన్' వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వడ్డీ లేకుండా రూ.3 లక్షలు

వడ్డీ లేకుండా రూ.3 లక్షలు

గ్రామీణ ఓటర్లను తమ వశం చేసుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు రుణమాఫీని ప్రకటించారు. సున్నా వడ్డీకి రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఇది 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది.

హార్దిక్ పటేల్ టేప్

హార్దిక్ పటేల్ టేప్

హార్దిక్ పటేల్ సెక్స్ టేప్‌లు ఎన్నికల సమయంలో కలకలం రేపాయి. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కానీ ఎన్నికలకు ముందు హార్దిక్ సెక్స్ టేపులు తీవ్ర సంచలనం రేపాయి. మరోవైపు, రాహుల్‌తో కలిసి సల్మాన్ నిజామీ ప్రచారం చేశారు. దీంతో మోడీ గతంలో నిజామీ అఫ్జల్ గురుకు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారంటూ వెల్లడించారు. ఇదిలా ఉండగా, కులసంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం బీజేపీని దారుణంగా దెబ్బతీసింది.

English summary
The less-than-impressive show put up by the Bharatiya Janata Party (BJP) in Gujarat, where it had a target of 150 seats, indicates the party has snatched the victory out of the jaws of defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X