బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏది జరక్కూడదనుకున్నారో అదే: భారత్‌లో కొత్త మహమ్మారి: ప్రాణాలు అరచేతుల్లో: హైదరాబాద్ సహా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏది జరక్కూడదనుకున్నారో అదే జరిగింది. బ్రిటన్‌లో సరికొత్తగా..అత్యంత ప్రమాదకరంగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో ప్రవేశించింది. భయపడినట్లే..బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన వారిలో సరికొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. మూడు పెద్ద రాష్ట్రాలు ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ బారిన పడే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అదికారికంగా ప్రకటించింది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

హీరో రామ్ చరణ్‌కు సోకిన కరోనా: సెట్‌లో కలకలం: అభిమానులు ఏం చెబుతున్నారంటే?హీరో రామ్ చరణ్‌కు సోకిన కరోనా: సెట్‌లో కలకలం: అభిమానులు ఏం చెబుతున్నారంటే?

 దేశవ్యాప్తంగా ఆరు కేసులు..

దేశవ్యాప్తంగా ఆరు కేసులు..

దేశవ్యాప్తంగా మొత్తం ఆరు కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందట ప్రకటించింది. బెంగళూరు-3, హైదరాబాద్-2, పుణేలో ఒక కేసు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన వారిలో ఇప్పటిదాకా ఆరుమందిలో కరోనా వైరస్ కొత్త జీనోమ్ వేరియంట్ కనిపించిందని స్పష్టం చేసింది. ఆ ఆరుమందిని ఐసొలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది.

కరోనా లక్షణాలతో..

కరోనా లక్షణాలతో..

బ్రిటన్‌లో సరికొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన విమాన ప్రయాణికులకు అధికారులు నిర్ధారణ పరీక్షలను చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించారు. వారి నుంచి నమూనాలను సేకరించారు. హైదరాబాద్‌కు వచ్చిన వారి నమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు. బెంగళూరు, పుణేలకు చెందిన ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను నిమ్హాన్స్, జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. తాజాగా ఆ శాంపిళ్లకు చెందిన రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తం ఆరు కేసులు..

మొత్తం ఆరు కేసులు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్ పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, బెంగళూరులోని నిమ్హాన్స్, పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి అందిన నివేదికలను క్రోడీకరించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాలు ఇక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యూకే నుంచి వచ్చిన ఆ ఆరుమంది ఎవరెవరిని కలుసుకున్నారనే విషయంపై ఆరా తీయాలని ఆదేశించినట్లు తెలిపింది.

33 వేల మంది ప్రయాణికులు..

33 వేల మంది ప్రయాణికులు..

కిందటి నెల 25-ఈ నెల 23వ తేదీ మధ్య బ్రిటన్ నుంచి స్వదేశానికి మొత్తం 33 వేల మంది ప్రయాణికులు తిరిగి వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. వారందరినీ ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. వారి కాంటాక్టులనూ గుర్తించాలని సూచించింది. బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఇప్పటిదాకా 114 మంది కరోనా వైరస్ బారిన పడినట్టు నిర్ధారించింది. విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ద్వారా వారికి నిర్వహించిన టెస్టుల ద్వారా ఈ విషయం తేలింది. ఈ 114 మందికి సంబంధించిన శాంపిళ్లను టెస్టింగుల కోసం పంపించారు. వాటి నివేదికలు అందాల్సి ఉంది.

Recommended Video

Strain Virus: నెల్లూరులో కరోనా కలకలం..బ్రిటన్ నుంచి ఇప్పటి వరకు 46 మంది ..!!

English summary
Six UK returnees found positive for new UK variant genome. Samples of 3 UK returnees have been tested and found positive for new UK strain in NIMHANS, Bengaluru, two in Centre for Cellular and Molecular Biology, Hyderabad and one in National Institute of Virology, Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X