వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిని బల్లకు కట్టేసి.. ఇద్దరు స్వీపర్లు..

రాజస్థాన్‌లోని ఓ స్కూల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. బర్మేర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. చిన్నారిని బల్లకు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌లోని ఓ స్కూల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. చిన్నారిని బల్లకు కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బర్మేర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

రెండో తరగతి చదువుతున్న చిన్నారి ఇంటికి వచ్చి కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యుడు చెప్పిన నిజం విని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.

girl-gang-raped

చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను ప్రశ్నించగా స్కూల్లో జరిగిన విషయం చెప్పింది. దీంతో పాఠశాలలో పనిచేసే ఇద్దరు స్వీపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల గురుగ్రామ్‌లో ప్రద్యుమ్న, ఢిల్లీలోని స్కూల్లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనలు మరిచిపోకముందే తాజా ఘటన వెలుగు చూడడంతో చిన్నారుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
On Friday, a six-year-old girl was allegedly gangraped by sweepers at a government school in Rajasthan’s Barmer. Police filed a complaint on the basis of the victim’s father’s statement, which stated that the class 2 student was tied to a table near the school’s washroom and gangraped by sweepers. Police detained two men, who are both sweepers of the school. The victim complained of pain in her private parts and her parents rushed her to the local hospital, bringing the incident to light. Doctors suspected sexual assault and police was informed. Superintendent of Police Gagandeep Singla and district collector Shivprasad Nakate inspected the school premises and authorities were questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X