వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే ఆరో విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించి 59 పార్లమెంటరీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పలుచోట్ల ప్రధాన పార్టీల ప్రముఖులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి, కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్ బరిలో నిలిచిన న్యూఢిల్లీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక చివరి దశయిన ఏడో విడత పోలింగ్ మే 19వ తేదీన జరగనుంది. మే 23వ తేదీన దేశవ్యాప్తంగా అన్నీ పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి.

బరిలో ప్రముఖులు.. కొన్నిచోట్ల ఉత్కంఠ

బరిలో ప్రముఖులు.. కొన్నిచోట్ల ఉత్కంఠ

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏడు విడతల్లో పోలింగ్ షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తయింది. ఆదివారం (12.05.2019) నాడు ఆరో విడత పోలింగ్ జరుగుతుంది. పలు రాష్ట్రాలలోని 59 పార్లమెంటరీ స్థానాల్లో జరుగుతున్న పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది. చాలాచోట్ల ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు బరిలో నిలిచారు.

జార్ఘండ్‌లో 4, ఢిల్లీలో 7, బీహార్ లో 8, మధ్యప్రదేశ్‌ లో 8, పశ్చిమ బెంగాల్‌లో 8, హర్యానాలో 10, ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
మొత్తం 59 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 979 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా హర్యానాలో 223 మంది అభ్యర్థులు బరిలో నిలవడం గమనార్హం. మొత్తం 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అక్కడ ఎవరు గెలిస్తే.. వాళ్ల పార్టీదే అధికారం..!

అక్కడ ఎవరు గెలిస్తే.. వాళ్ల పార్టీదే అధికారం..!

59 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా.. ప్రధానంగా న్యూఢిల్లీ స్థానం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్ధాలుగా ఇక్కడ ఎవరైతే గెలుస్తారో.. వారి పార్టీయే అధికారంలోకి వస్తుండటం విశేషం. 2014లో బీజేపీ అభ్యర్థి మీనాక్షి ఈ స్థానంలో గెలుపొందడంతో.. ఆ పార్టీ దేశవ్యాప్తంగా బంపర్ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. 2009, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ విజయం సాధించడంతో.. ఆ పార్టీకే అధికారం దక్కింది. ఈసారి కూడా వాళ్లిద్దరే పోటీపడుతున్నారు.

ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరపున మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తలపడుతున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. వీరిద్దరికీ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే మొదటిసారి. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్‌ నేత మనోజ్‌ తివారి, కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బరిలో నిలిచారు.

అంతా ఉద్ధండులే..!

అంతా ఉద్ధండులే..!

మధ్య ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లోని గుణ పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున తలపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సింధియాకు కీలక పదవి లభించింది. ఎన్నికల్లో ఇప్పటివరకు గుణ సెగ్మెంట్ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు సింధియా. ఐదోసారి గెలించేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. సింధియా గెలుపు బాధ్యతలను ఆయన భార్య ప్రియదర్శిని రాజే చూసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్ దిగ్విజయ్‌ సింగ్‌ భోపాల్‌ సెగ్మెంట్ నుంచి పోటీపడుతున్నారు. ఆయనపై బీజేపీ తరపున సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ బరిలో నిలిచారు.

యూపీ పోరు.. గెలిచేదెవరు?

యూపీ పోరు.. గెలిచేదెవరు?

ఇక ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో నిలిచారు. 2014 నాటి ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. ఇక అదే రాష్ట్రంలోని ఫిలిబిత్ స్థానం నుంచి బీజేపీ తరపున వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి ఆయన తల్లి, కేంద్రమంత్రి మేనకా గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వరుణ్ గాంధీ సుల్తాన్‌ పూర్‌ పార్లమెంటరీ స్థానం నుంచి గెలుపొందారు. ఈసారి అనూహ్యంగా తల్లికొడుకులు వారు పోటీ చేసే స్థానాలు మార్చుకోవడం గమనార్హం.

English summary
Lok Sabha Elections Sixth Phase Polling Started. In Many Segments, VIP Leaders contesting. New Delhi Lok Sabha Segment Will Decide The Central Government. Its an sentiment since long time, the candidate who won from there, his party will form the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X