వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. ముజఫర్‌నగర్ ఆస్పత్రి వద్ద ఎముకలు, పుర్రె ...

|
Google Oneindia TeluguNews

పాట్నా : బీహార్‌లో మెదడువాపు వ్యాధి విజృంభణతో చిన్నారులు పిట్టల్లా రాలుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ముజఫర్ నగర్ ఆస్పత్రిలోనే దాదాపు 108 మంది చిన్నారులు ఊపిరొదిలారు. వీరికి మెదడు వాపు వ్యాధి చనిపోయారు .. సరైన చర్యలు తీసుకోలేదు. వైద్యం అందించలేదనే విమర్శలు వచ్చాయి. కానీ ఆ ఆస్పత్రి సమీపంలో ఎముకలు బయటపడ్డాయి.

108 మంది మృతి
మెదడువాపు వ్యాధితో 108 మంది చిన్నారులు చనిపోయిన ఆస్పత్రి సమీపంలో ఎముకలు కనిపించడంతో కలకలం రేగింది. ఎముకల, పుర్రె ఫోటోలను వార్తా సంస్థ పేర్కొంది. ముజఫర్ నగర్ లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సమీపంలో అవి ఉన్నట్టు తెలిపింది. దీనిపై వివాదం చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది స్పందించారు. ఈ ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని .. దీంతో వారు ఎవరు ? ఎలా చనిపోయారనే విషయం తేలుతుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్కే సాహీ పేర్కొన్నారు.

Skeletons found outside Bihar hospital where 108 children died of encephalitis

తేలనుందా ?
పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతుందని .. దీనికి సంబంధించి కాలేజీ ప్రిన్సిపాల్ తో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపించాలని కోరుతామని ఆయన పేర్కొన్నారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలాన్ని నిశీతంగా పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరినీ దహనం చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆస్పత్రిలో 108 మంది చనిపోవడంతో .. ఎముకలు, పుర్రె బయటపడటంతో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలని వైద్యాధికారులను కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ ఆదేశించారు.

English summary
Remains of human skeletons were discovered behind the compound of a hospital in Muzaffarpur in Bihar where at least 108 children have died due to acute encephalitis syndrome (AES) or Japanese encephalitis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X